Logo
Date of Publish : 29 July 2023, 8:18 am
Editor : Sake Naresh

నిరుపేద కుటుంబానికి డాక్టర్ కందుల చేయూత

     విశాఖపట్నం ( జనస్వరం ) : నిరుపేద కుటుంబానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు. బీచ్ లో జరిగిన ప్రమాదంలో కాళ్లు చచ్చు బడిపోయి నడవలేని స్థితిలో ఉన్న యువకునికి వీల్ చైర్ ను అందజేశారు. పవనన్న ప్రజా బాట 80 వ రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 41 వ వార్డు జ్ఞానాపురంలో ఆ యువకుని ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. వీల్ చైర్ ను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఊహించని విధంగా ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న యువకుడికి తను అండగా ఉంటానని తెలిపారు. ఈ మేరకు ఆ యువకుడికి వీల్ చైర్ ను అందించడం కూడా జరిగిందన్నారు. తనకు ప్రజలకు మంచి చేయడమే తెలుసు అని చెప్పారు. ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటానని పేర్కొన్నారు. గత 80 రోజుల నుంచి నియోజకవర్గంలో పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమం నిర్విరామంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని సుమారుగా అన్ని వార్డులలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మంచి చేసేందుకు తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు జనసేన నాయకులు అంతోని, చెరుకూరు గణేష్, అప్పారావు, మణి, ప్రసాద్, సంతోష్, జానకి, మంగ, లలిత, ఝాన్సీ, కుమారి, దుర్గ, దక్షిణ నియోజకవర్గం జనసేన యువ నాయకులు కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com