- మనమంతా ఏపీలో ఉన్నామా లేక తాలిబాన్ పాలనలో ఉన్నామా అర్దం కాని పరిస్థితి
- పవన్ కళ్యాణ్ కు జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
- వైసీపీ రాజకీయ పార్టీ కాదు.. పెట్టుబడి దారీ వ్యవస్థ
- విశాఖపట్నంలో మిషన్ బిల్డ్ పేరుతో వైసీపీ నేతలు దోచుకున్నారనేది వాస్తవం కాదా?
విజయవాడ, (జనస్వరం) : జనసేనపార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడం అంటే ప్రజాస్వమ్యానికి చీకటి రోజుఅని, జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే పోలీసులు పని చేస్తున్నారని, చట్ట ప్రకారం నడుచుకోవడమే పోలీసులు మరచిపోయారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఎం కావాలని? పవన్ కళ్యాణ్ జనవాణి నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి చెప్పాలని, మా పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి వైసీపీ అనుమతి కావాలా అని? మనమంతా ఎపీలో ఉన్నామా లేక తాలిబాన్ పాలనలో ఉన్నామా అర్దం కాని పరిస్థితి అని, వైసీపీ పార్టీకి అనుకూలంగా పని చేసే పోలీసులు జీతాలు కూడా వారి వద్దే తీసుకోవాలని, విశాఖలో పవన్ కళ్యాణ్ పై పోలీసులు వ్యవహరించిన తీరు చూశాక మాకు పోలీసులపై నమ్మకం పోయిందని, ఏపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, పవన్ కళ్యాణ్ కు ఏపీ పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందని, పవన్ కళ్యాణ్ కి జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, పోలీసులు ఎవరి డైరెక్షన్లో, ఎందుకోసం పని చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ప్రజా స్వామ్యానికి విరుద్దంగా, చట్టానికి వ్యతిరేకంగా విశాఖలో పోలీసులు తీరు చాలా దుర్మార్గమని, రాష్ట్రాన్ని వైసీపీ రాక్షసులు అన్ని విధాలా నాశనం చేస్తున్నారని, విపక్ష పార్టీల కార్యక్రమాలను కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని, వైసీపీ రాజకీయ పార్టీ కాదని, పెట్టుబడిదారుల పార్టీఅని ఎన్నికలలో వందల, వేల కోట్లు ఖర్చు పెట్టి.. గద్దెనెక్కాక రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని, వైసీపీ నాయకులు ఒక్కో నియోజకవర్గానికి 25కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని, అందుకే ఇది రాజకీయ పార్టీ కాదు.. పెట్టుబడి దారీ వ్యవస్థతో అని, అందుకే దోచుకుంటున్నారని, ఇసుక, మైనింగ్, మద్యం, అవినీతితో అందిన కాడికి దోచుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ కి ఎంతో ముందు చూపు ఉంది కాబట్టే.. వైసీపీ వస్తే ఏం జరుగుతుందో ఎప్పుడో చెప్పారని, ఆయన చెప్పిన విధంగానే రౌడీ యుజం, గూండా యిజం, కబ్జాలు పెరిగిపోయాయని, వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ రాకపోతే ఎపీలో ప్రజలకు, యువతకు భవిష్యత్ ఉండదని, వైసీపీ పెట్టుబడిదారీ వ్యవస్థకు చరమ గీతం పాడాలని, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని, అనేకచోట్ల నిర్భంధించి మానసికంగా వేధించారని, 72 మందిలో 62 మందిని సొంత పూచీకట్టుంపై విడుదల చేశారంటే పోలీసులకు చెంప దెబ్బ కాదా? అని 307 సెక్షన్ కూడా కోర్టు మార్చిందంటే ఎంత కుట్రతో పోలీసులు కేసులు పెట్టారో ఆలోచన చేయాలని, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ప్రకటించిన నాటి నుంచే వైసీపీ నేతలు అవాస్తవాలతో విషం చిమ్మారని, విశాఖపట్నం నుంచి వెళ్లిపోయిన లూలు, అదానీ గ్రూప్, ఇతర సంస్థల గురించి మంత్రి అమర్నాధ్ ఎందుకు మాట్లాడటం లేదని, విశాఖపట్నంలో మిషన్ బిల్డ్ పేరుతో వైసీపీ నేతలు దోచుకున్నారనేది వాస్తవం కాదా? అని, జగన్ దెబ్బకు పరిశ్రమలు మూసివేసి.. విశాఖ వదిలి వెళ్లిపోయారని, దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, పవన్ కళ్యాణ్ గారు విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తే లక్షల మంది తరలి వచ్చారని ఆరోజు ఇసుక విధానాన్ని మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని, బీజేపీతో పొత్తులో ఉన్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్షలాది మందితో సభ పెట్టారని, పవన్ పోరాటం ఫలితం వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని, ఉత్తరాంధ్రలో పవన్ కు బాగా ఆదరణ వస్తుందనే సమాచారం వల్లే జగన్ కుట్ర చేసి అడ్డుకున్నారని, రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ది జాడ లేదని కానీ అభివృద్ది వికేంద్రీకరణ ఏమిటొ అని, ఈ అంశాలపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని, ఎవరి చెవుల్లో పూలు పెట్టాలని మీరు ఇటువంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, జగన్ స్వయంగా మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకుంటున్నామని అసెంబ్లీలో చెప్పారని, ఇంకా మూడు రాజధానుల పేరుతో ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడతారని, వైసీపీ కుట్రలు, కుతంత్రాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు మిమ్మలను తరిమి కొడతారని, రాజధాని అమరావతి అని అందరూ ఆమోదించిన నాడు.. ఉత్తరాంధ్ర నాయకులు ఏం చేస్తున్నారని, వైసీపీ నేతలు మాత్రమే అమరావతి పై విషం చిమ్ముతున్నారని, రైతుల పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే.. జనసేనతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచాయని, రాజధాని కోసం భూములు ఇచ్చి బజారుపడిన రైతులపై కుట్రలు చేయడానికి సిగ్గుండాలని, అప్పు ఎనిమిది లక్షల కోట్లు పెరిగిందని, అభివృద్ది మాత్రం కనిపించడం లేదని, విశాఖలో వైసీపీ నేతలు చేసిన కబ్జాలు, దారుణాలపై జనవాణిలో బయట పడతాయనే భయం పట్టుకుందని, అందుకే పవన్ పర్యటనను పోలీసులను అడ్డం పెట్టుకుని ఆపారని, వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు విలేకరుల సమావేశంలో లీగల్ సెల్ సభ్యులు గంజి పవన్, నగర కమిటీ సభ్యులు సబ్బిన్కర్ నరేష్, మూడో డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాస్, పీ.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com