– మరమ్మతులకు నోచుకోని మార్కెట్
– స్లాబులు బీటలు వారి షాపుల లోపల కురుస్తున్న వర్షం
– ఆందోళనలో వ్యాపారస్తులు
– జనసేనపార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్
విజయవాడ, (జనస్వరం) : కొత్తపేట హనుమంతరాయ చేపల మార్కెట్ ను మంగళవారం జనసేనపార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్ స్థానిక వ్యాపారస్తులుతో కలసి మార్కెట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మహేష్ తో చిన్నపాటి వర్షానికే స్లాబ్లు లీక్ అయి, దారాలు దారాలుగా వర్షం షాపు లోపలనే పడుతుందని, అందువలన సరుకు మొత్తం తడిచిపోయి ప్రతి బస్తా సరుకుకు ఐదు వేల నుంచి పది వేలు నష్టపోతున్నామని, నాలుగు సంవత్సరాలుగా ఈ మార్కెట్ కనీస మరమ్మతులకు నోచుకోలేదని, ఎన్నిసార్లు అధికారులకు, స్థానిక శాసన సభ్యునికి తెలియజేసిన వారి వద్ద నుండి స్పందన కరువైందని తెలిపారు. టెర్రస్ బాగు చేస్తామని చెప్పి ఎండాకాలానికి ముందు పగలగొట్టి వదిలేశారని, అందువలన నీరు విపరీతంగా ఇంకిపోయి గోడలు బీటలు వారి నెత్తిపై పెచ్చులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్లాబ్స్ నుంచి పడుతూన్న నీళ్ల కోసం డబ్బాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మొదటి అంతస్తులోనే కాదు గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా కింద షాపులులో గోడలు బీటలు వారి స్లాబ్ లో నుంచి నీరు లీకేజీ అవుతుందని తెలిపారు. ఒక్కొక్కసారి కరెంటు షాక్ కొడుతుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు లేనందువల్ల వ్యాపారం సరిగ్గా జరగక జీవనోపాధి కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ వ్యాపారస్తుల ఆవేదనను అర్థం చేసుకొని తక్షణమే హనుమంతరాయ చేపల మార్కెట్ ను సందర్శించి వారి సమస్యలను పరిష్కరించాలని మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో 53 డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీను, జనసేన నాయకులు రేకపల్లి శ్రీను, శిగనం శెట్టి రాము స్టాలిన్, పోలిశెట్టి శివ, బావిశెట్టి శ్రీను, సాబిన్కర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.