అనంతపురం రూరల్, సెప్టెంబర్ 3 (జనస్వరం) : అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామ పంచాయితీలో ఉన్న వాటర్ ట్యాంక్ ను మున్సిపల్ కార్మికులు మంగళవారం శుభ్రపరిచారు. ఈ మేరకు పంచాయితీ సిబ్బంది మాట్లాడుతూ ఈ వర్షాభావ కాలంలో త్రాగునీరు కలుషితం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. గ్రామ ప్రజలకు తాగు నీటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని వాటర్ ట్యాంక్ ను శుభ్రపరిచారు. అలాగే గ్రామం అంతా బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమలు వ్యాపించకుండా చూస్తున్నామని అన్నారు. ఈ సీజన్ లో గ్రామంలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని తెలిపారు. తాగునీటి వాటర్ ట్యాంకును శుభ్రం చేయడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com