పలాస ( జనస్వరం ) : జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభ్యుత్వం ఏర్పాటు చేసేవిధంగా పలాస నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా జనసైనికులు అందరూ కలిసి పనిచెయ్యాలని కోరారు. జనసైనికులు అందరూ అధినాయకుడు తీసుకొనే నిర్ణయానికి జనసైనికులు కట్టుబడి ముందుకు వెళ్ళాలని, గ్రామ, పంచాయతీ స్థాయిలో నాయకత్వన్ని బలపరచాలన్నారు. యువకులు నాయకత్వ లక్షణాలను పెంచుకుని యువ నాయకులుగా తయారవ్వాలని సూచించారు. యువత నాయకులుగా ఎదగడానికి జనసేనపార్టీ మంచి వేదికను కల్పిస్తుంది అని ఈ అవకాశాన్ని రాజకీయాలపట్ల ఆసక్తి ఉన్న యువత అందిపుచ్చుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం జనసేన నాయకులు మజ్జి భాస్కరరావు, జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా మాజీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు కంచరాన అనిల్, మందస మండలం నాయకులు తిరుపతి గౌడ, పందిరి నీలయ్య, రాపాక కేశవరావు, రౌతు చిరంజీవి, కుంటికోట పంచాయతీ నాయకులు ఉమాపతి, అఖిల్, శివ జనసైనికులు సాయి, రామకృష్ణ, నాగ చైతన్య, మణికంఠ, రాహుల్, కుర్మా, ఖాగెస్, దామోదర్, రాము, త్రినాధ్, మన్మధ, లోకేష్, భీమారావు, శివ, పవన్, భాస్కర్, సింహాచలం పాల్గొన్నారు.