రాజంపేట ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ప్రశ్నించిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి గారికి, వైసిపి నాయకత్వానికి, ఎంపీ మిధున్ రెడ్డికి , ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ₹కి మద్యపానం నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చి హైవేలో మద్యం షాపులను బార్ లను తీసేసి ప్రోమో కేర్ సెంటర్ ను సంపూర్ణ స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావటంతో పాటు , ఏరియా హాస్పిటల్ గా ఉన్న రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే జిల్లా హాస్పిటల్ గా గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. వైద్య సదుపాయాలను పేదలకి అందుబాటులోకి తీసుకొచ్చి వచ్చే ఎలక్షన్లలో ఓట్లు అడగాలని రాజంపేట జనసేన నాయకులు సవాల్ విసిరారు. అన్ని అర్హతలు ఉన్న రాజంపేట జిల్లా కేంద్రంగా కాకుండా మెడికల్ కాలేజీని కూడా కోల్పోయి కనీస ఆరోగ్య వసతులన్నీ ఏర్పాటు చేయలేకపోతున్నారు. జనసేన పార్టీ డిమాండ్లను తీర్చని పక్షంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు మీడియా సమక్షంలో ప్రభుత్వానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు బాల సాయి కృష్ణ, ఓబులేసు జిగిలి, షేక్ సలీం, రామ శ్రీనివాసులు, వీర మహిళలు రెడ్డి రాణి N, రూప పీ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com