Logo
Date of Publish : 04 February 2024, 7:22 pm
Editor : Sake Naresh

జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ ఆసుపత్రి మంజూరు చేయాలి

    విజయనగరం ( జనస్వరం ) : జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ, ఆదివారం మయూరి కూడలిలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ గారు దీక్ష చేపట్టారు. దీనికి జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం సమన్వయకర్త  మర్రాపు సురేష్ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ క్యాన్సర్‌ ప్రాణాంతక రోగమని, దీని బారిన పడినవారు ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేసుకుని వైద్యం చేయించుకున్నా, చివరకు ప్రాణాలు నిలుపుకోలేక పోతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు విశాఖ వెళ్లి వైద్యం చేయించుకోలేక అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. విజయనగరంలో ప్రభుత్వమే క్యాన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభిస్తే, ఈ ప్రాంత ప్రజలతో పాటు శ్రీకాకుళం, ఒడిశా వాసులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, గజపతినగరం నాయకులు పండు, బాలు, గౌరీ నాయడు, శ్రీను, మహేష్, ప్రశాంత్, జానీ, బద్రి, చిన్ని, రాంబాబు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com