
విజయనగరం ( జనస్వరం ) : జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదివారం మయూరి కూడలిలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ గారు దీక్ష చేపట్టారు. దీనికి జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం సమన్వయకర్త మర్రాపు సురేష్ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ ప్రాణాంతక రోగమని, దీని బారిన పడినవారు ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేసుకుని వైద్యం చేయించుకున్నా, చివరకు ప్రాణాలు నిలుపుకోలేక పోతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు విశాఖ వెళ్లి వైద్యం చేయించుకోలేక అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. విజయనగరంలో ప్రభుత్వమే క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తే, ఈ ప్రాంత ప్రజలతో పాటు శ్రీకాకుళం, ఒడిశా వాసులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, గజపతినగరం నాయకులు పండు, బాలు, గౌరీ నాయడు, శ్రీను, మహేష్, ప్రశాంత్, జానీ, బద్రి, చిన్ని, రాంబాబు పాల్గొన్నారు.