అనంతపురం ( జనస్వరం ) : భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు. సమాజ తలరాతన మార్చే అలాంటి ఓటును నిజాయితీ నిబద్ధత కలిగిన పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం.. జనసేన ను గెలిపిద్దాం అని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక రాంనగర్ కార్యాలయంలో నగర, జిల్లా కమిటీ సభ్యులు నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు సమావేశంలో టి.సి.వరుణ్ మాట్లాడుతూ యువతతో పాటు వివిధ రంగాల ప్రజల్లో జనసేన పార్టీ పట్ల ఉన్న సానుకూల వైఖరిని ఓటుగా మార్చే బాధ్యతను ప్రతి ఒక్క నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తీసుకోవాలన్నారు. వారి వారి పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ… 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులను ఓటర్లుగా చేర్పించే క్యాంపెయిన్ ను విస్తృతంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జనసేన పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా మనమందరం ఐక్యమత్యంతో ముందుకెళ్దాం అన్నారు. మొదటి ఓటు జనసేనకే అన్న నినాదంతో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని. నగర, జిల్లా కమిటీ సభ్యులకు, నాయకులకు, జనసైనికులకు మరియు వీరమహిళలకు, కార్యవర్గ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా, నగర కమిటీ సభ్యులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.