జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా పార్వతీపురం జనసైనికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కరోన మహమ్మారి వలన హాస్పిటల్ నందు ఉన్న అత్యవసర సేవలకు రక్తం కొరత ఏర్పడం వలన అనేకమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, రక్తం దానం చేయడం అంటే ప్రాణం దానం చేయడం తెలియజేసారు. ఈ కార్యక్రమానికి 20 మంది జనసైనికులు బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్వతిపురం జనసేన పార్టీ బ్లడ్ డోనర్స్ ప్రెసిడెంట్ నాని మరియు వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్, చైతన్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్తలు చందక అనిల్, బంటు శిరీష్, నెయ్యిగాపుల సురేష్, మీసాల రవితేజ మరియు మిగతా కార్యకర్తలు పాల్గొన్నారు.