రాజంపేట ( జనస్వరం ) : వీరబల్లి మండల పరిధిలోని సానిపాయి గ్రామ పంచాయతీ లో చిరంజీవి యువత రాజంపేట అధ్యక్షుడు గుగ్గిల నాగార్జున గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారి 68వ పుట్టినరోజు సందర్భంగా దీప బ్లడ్ బ్యాంకు వారితో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రాజంపేట నియోజకవర్గ జనసేనపార్టీ సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదానం యొక్క ఆవశ్యకతను,చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవల గురించి గుర్తు చేసారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి చిరంజీవి గారు నిదర్శనం అని తెలిపారు. అదేవిధంగా చిరంజీవి లాంటి మహానుభావులు కోటికొక్కడుంటారని,రాబోవు తరాలు వారు కూడా చిరంజీవి గారిని మార్గదర్శకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కటింగ్ చేసి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో ఆయన పుట్టినరోజులు వేడుకలు మరెన్నో మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాగే జరుపుకోవాలని ఆ దేవదేవుని వేడుకుంటూ... తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, స్థానికులు వీరబల్లి, సుండుపల్లి, మండలాల,నియోజకవర్గ వ్యాప్తంగా మరియు రాయచోటి నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు చిన్నారి జయరామ్,జనసేన వార్డు మెంబెర్ గుగ్గిళ్ళ వెంకటేష్,కాపు సంక్షేమ యువసేయువనాయకుడు అబ్బిగారి గోపాల్, జనసేన యువనేత అతికారి దినేష్, పార్టీ శ్రేణులు, నాయకులు,జనసైనికులు,యువకులు, చిరంజీవి గారి అభిమానులు,వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com