పాలకొండలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతూ మా రక్త నిధికి రక్త దాతలు తీసుకువచ్చే విషయంలో మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం లో జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారు ప్రథములని ఈ సందర్భంగా కొనియాడారు. సత్తిబాబు గారు మాట్లాడుతూ మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వేసిన బాటలో మేము నడుస్తున్నాము. ఆయన అశాయ సాధనకు నావంతు కృషి గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అని ప్రజలు కష్టం లో మేము తోడుగా ఉంటాం అని అలాగే మనం చేసే ఈ రక్త దానం వాళ్ళ మరో నలుగురికి ప్రాణ దాతలు గా ఉండొచ్చు అని చెప్పారు. తమ ఆసుపత్రిలో ఇప్పటి వరకు సుమారు ఓ 30 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సత్తిబాబు గారికి దుశ్శాలువతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు గొర్ల మన్మథ, డొంక శివప్రసాద్, పొట్నురు రమేష్, సతివాడ వెంకట రమణ, శ్రీను, రవితేజ, శంకర్రావు(ఆర్మీ), నరేంద్ర, శంకర్, చిన్న, తదితర సైనికులు రక్తదానం చేస్తూ సన్మాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారు మాట్లాడుతూ పిలవగానే వచ్చి రక్తదానం చేసిన ప్రతి జన సైనికుడికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్పారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com