గోనెగుండ్ల, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 51 వ జన్మదిన వేడుకలను మండల కేంద్రమైన గోనెగండ్లలో జనసేన కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటు కేక్ కట్టింగ్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం గోనెగండ్లలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యకర్తలతో కలిసి రేఖగౌడ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రేఖగౌడ్ మాట్లాడుతూ సామాజిక సేవలో అధినేత బాటలో నడుస్తూ పార్టీకి సైనికుల్లా పనిచేసే యువతరం అధికంగా జనసేనలోనే ఉన్నారని అటువంటి యువత తలుచుకుంటే రాష్ట్ర భవిష్యత్తునే మార్చగలరని యువశక్తిని కొందరు తక్కువగా అంచనా వేస్తున్నారని భవిష్యత్తులో రాజకీయ పెను మార్పులు స్పుష్టించే శక్తి ఒక యువతకే సాధ్యమని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే ఎకైక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. అక్షయ బ్లడ్ డోనేషన్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అభిమానులు కార్యకర్తలు భారీగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గానిగ బాషా, మాలిక్, రామంజి నేయులు, భాస్కర్, రవికుమార్, విజయ్, మాబాష, అలిబాష, దూద్ పిరా, ఇస్మాయిల్, మునాఫ్, మహమ్మద్ హుస్సేన్, ఖాసీం, మధు, వెంకటేష్, ఉరుకుందు, శ్రీను, శేఖర్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com