చిట్యాల, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పుట్టినరోజు సందర్భంగా చిట్యాల గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గం, క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు ఈడిగ చిరంజీవి గౌడ్ వారి టీం ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 51 వ జన్మదిన సందర్భంగా చిట్యాల గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి వారి టీం వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. చిట్యాల గ్రామంలో జనసేన పార్టీకి వెన్నెముకగాలాంటి వ్యక్తి చిరంజీవి, జనసేన పార్టీ బలపేతం కోసం తన శక్తి మేర కష్టపడుతున్న కష్టజీవి, నిస్వార్థ జనసైనికుడు, ఎప్పుడు పార్టీ బలపేతం కోసం, ఆలోచించే వ్యక్తి రాబోయే కాలంలో గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి ప్రజలు అండదండగా నిలవాలని, ఆ విధంగా మనం పని చేయాలని కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది ఏం లేదని, ఇలాగే మనమంతా కలిసికట్టుగా పోరాడి 2024లో జనసేన పార్టీ జెండా ఎగరేద్దాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నాగేశ్వరరావు, తిరుపాల్, భాస్కర్, పులి శేఖర్, గోపాల్, శ్రీరాములు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com