చీమకుర్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నాడు కొత్త బస్టాండ్ వెనకాల గల స్థానిక ఎస్ కే ఆర్ బదురుల పాఠశాలలో చీమకుర్తి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు ఏర్పాటు చేశారు. 50 మంది జనసేన కార్యకర్తలు రక్తదానం చేయగా భారీ సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని చీమకుర్తి మండల జనసేన పార్టీ అధ్యక్షులు ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం బధిరుల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి అరుణ మాట్లాడుతూ చీమకుర్తి మండల జనసేన పార్టీ బలంగా నిలబడుతున్న విషయన్ని గ్రహించిన అధికార పార్టీ నాయకులు జనసైనికులను ఇబ్బందులు పెడుతున్నారని. ఇబ్బంది పెడితే. అంతకు రెండింతలు ఉత్సాహంతో ఎదుగుతారు అని అన్నారు. చీమకుర్తి మండల అధ్యక్షులు పల్లపు శివప్రసాద్ మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంతో రక్తదాన శిబిరానికి పాల్గొని రక్త దానం చేసిన జనసైనికులకి కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ తో పోలీసులు కొమ్ము కాస్తూ జనసైనికులనీ ఇబ్బంది పెట్టటం తగదని, ఇబ్బందులు పెడితే దేనికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు కమతం , సంతనూతలపాడు ఐటి విభాగం సభ్యులు యాదాల కోటి, తోట సుధాకర్,అనిల్,ముత్యాల సురేష్, వెన్నుకోట కృష్ణ, ముప్పరాజు వెంకన్న, కణాల మారుతి, మహేష్, వీరమాస వీరాంజనేయులు, సుంకర మురళి,దొడ్ల మహేంద్ర, బీద నరసింహ, తన్నీరు శ్రీకాంత్, ఇజ్జగిరి ఘన వేలుగు రాజేష్ చల్ల సురేష్, పల్లపు పూర్ణ, జయశంకర్, బుడ్డ, పల్లపు సుజాత శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com