ఆదివాసి భాష విద్యా వాలంటీర్లను ప్రభుత్వం తక్షణమే రెన్యువల్ చేయాలి : జనసేన నాయకులు సాయి బాబా, దురియా

ఆదివాసి

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గములో  ఆదివాసి విద్య అభివృద్ధి కోసం నియమించిన ఆదివాసి భాష విద్యా వాలంటీర్లను ప్రభుత్వం తక్షణమే రెన్యువల్ చేయాలని జనసేన పార్టీ నాయకులు సాయి బాబా, దురియా, సన్యాసిరావు, తదితరులతో మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ఏజెన్సీలో మాతృ భాషలో భాగంగా విద్యార్థి విద్యార్థులకు విద్యాబోధనకు గత ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యం ఇచ్చాయని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నేటికి ఆదివాసి భాష విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయకపోవడంతో, ఒక పక్క ఆదివాసి విద్యార్థినీ విద్యార్థులు విద్యకు ఆమడ దూరంలో ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని, మరోపక్క ఆదివాసి భాష వాలంటీర్లు రెన్యువల్ కాకపోవడంతో కుటుంబ పోషణ లేక తల్లడిల్లే పరిస్థితి ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, సి ఆర్ టి లను రెన్యువల్ చేయకుండా ఉండడం వలన ప్రాథమిక పాఠశాలలోని సుమారు నాలుగు వేల మంది చిన్నారులు విద్యకు దూరం అవుతున్నారని, విద్యార్థులకు ప్రాథమిక విద్య పునాది అనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని, ఇటువంటి ధోరణి ప్రభుత్వం విడనాడాలని ప్రభుత్వానికి సూచించారు. ఆదివాసి భాష విద్యా వాలంటీర్లు పాడేరు ఐటీడీఏ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లు కూడా అనిపించలేదా ? అని ఈ సందర్భంగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వము మీ కళ్ళు తెరవండి, ఆదివాసి భాష విద్య వాలంటీర్ల సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రండి అని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. ఆదివాసి భాష విద్య వాలంటీర్లను పాడేరు ఐటిడిఎ లో ప్రాంగణంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, ఆటో యూనియన్ నాయకులు, కొండలరావు, తులసి రామ్, సింహాద్రి, రాజ్ కుమార్, అప్పన్న, బాబురావు, అప్పారావు, రఘువరన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way