నిడమర్రు మండలం జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

    ఉంగుటూరు, (జనస్వరం) : ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం నిడమర్రు గ్రామంలో జనసేన నాయకులు మైలవరపు సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో గణపవరం మీనాక్షి ఐ ఆసుపత్రి వారి సహకారంతో డాక్టర్ హరినాథ్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి కంటి పరీక్షలు చేసి కళ్ల జోళ్లు అందించారు. అదే విధంగా కళ్ల శస్త్ర చికిత్సలు అవసరమైన సుమారు 50 మందికి ఆపరేషన్లు రాజమండ్రి గౌతమి నేత్రాలయలో చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ హరినాథ్ రెడ్డికి జనసేన నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు జన సేన నాయకులు వంగా రఘు, తోట పవన్, తానేటి నాగేశ్వర రావు, చిన్నం ఆనంద్, దుసనపూడి శ్రీను, దుసనపుడి ఉమా సురేష్, గౌతు వెంకన్న, తాతాజీ, నందా తదితరులు పాల్గొన్నారు.

See also  హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ, సింహాచలం దేవస్థానం ఏఈ గారికి వినతి పత్రం అందజేత : జనసేన నాయకులు సందీప్ పంచకర్ల