* మంత్రి శ్రీ బాలినేనికి ఇదో ఎన్నికల హామీగా మిగిలింది
* ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద కబుర్లు చెప్పి ఇప్పుడు మరిచారు
* పోతురాజు కాలువ పరిశీలించిన ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు
ప్రకాశం, (జనస్వరం) : ఒంగోలు నగరంలో ఆగిపోయినటువంటి పోతురాజు కాలువ ఆధునీకరణ పనులను శుక్రవారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు పరిశీలించారు. అనంతరం ఈ సమస్యపై మాట్లాడుతూ ఒంగోలు నగరానికి తూర్పువైపున 7.3 కిలోమీటర్లు పొడవు 150 అడుగుల వెడల్పుతో ప్రవహిస్తున్న పోతురాజు కాలువ గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణలకు గురి అయ్యి నగరంలోని వ్యర్థాలతో పూడికతో నిండి పోయినది. ఈ కాలువ ఆధునీకరించి ఒంగోలు నగర శివారు కాలనీలను ముంపునకు గురి కాకుండా చేయవలెనని ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నారు. గతంలో లైలా తుఫాను కారణంగా శివారు ప్రాంతంలో ఉన్న సుమారు 25 కాలనీలు 10 అడుగుల మేర నీట మునిగి పోయిన అటువంటి పరిస్థితి అందరికీ తెలిసినదే. ఈ విషయం అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న బాలినేనిశ్రీనివాస్ రెడ్డి గారు ముంపు ప్రాంతాల్లో పర్యటించి పోతురాజు కాలువ ఆధునీకరించి ఆక్రమణలను తొలగించి శివారు కాలనీలను ముంపుకు గురి కాకుండా చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. సుమారు 15 సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రతి ఎలక్షన్ లో మీ ప్రచార కార్యక్రమంలో ఇదే హామీని ఇస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 120 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు ఇప్పటి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.30 కోట్ల రూపాయలు తగ్గించి రూ.90 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. కానీ అవి ప్రారంభించిన కొద్దిరోజులకే ప్రస్తుతం ఆరు నెలల నుంచి ఆగిపోయి ఉన్నాయి. నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ సమస్యను తన ఓటు బ్యాంకు రాజకీయం కోసం సుమారు 150 అడుగుల ఉండాల్సిన కాలువ వెడల్పు 40, 30, 20 అడుగులు వెడల్పు కుదించారు. అప్పటి ప్లాన్ ప్రకారం కాలువ ఇరువైపులా ఉండాల్సిన రోడ్డు సైతం మరిచారు. ఒంగోలు నగరానికి ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ సమస్యను ఈ రోడ్డు ద్వారా కొంతమేరకైనా తగ్గించవచ్చు. కాలువకు ఇరువైపులా ఉండాల్సిన రక్షణ గోడను సైతం 18 అడుగుల నుంచి 8 అడుగులు కుదించారు. ఇటువంటి రక్షణ గోడ వలన వరదను ఏ విధంగా ఆపగలరు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా తిరుపతి పట్టణం ఎంతటి విపత్తును ఎదుర్కొన్నదో మనందరికీ తెలుసు. అదే విధంగా మన ఒంగోలు నగరాన్ని కూడా కాలువ ఎత్తు తగ్గించి అదే పరిస్థితి తీసుకురావాలని చూస్తున్నారా? తక్షణమే కాలువ వెడల్పు కోసం ఇక్కడ ఇబ్బందులు పడుతున్న ఏరియాలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి వారికి పునరావాసం కల్పించి కాలువ వెడల్పు పెంచి కాలువ ఇరువైపులా రక్షణ గోడ ఎత్తు పెంచి రోడ్డు వేసే విధంగా చేపించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమములో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, బొందిల శ్రీదేవి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, రాష్ట్ర కార్యక్రమాల కార్యనిర్వహణ కార్యదర్శి బత్తుల రామకృష్ణ, జనసేన నాయకులు పిల్లి రాజేష్, ఆలా నారాయణ, తోట శబరి, దండే అనిల్, బొందిల మధు, మాల్యాద్రి నాయుడు, నరేంద్ర పోకల, భూపతి రమేష్, సాయి కుమార్, నరేష్ గంధం, అవినాష్ పర్చూరి, నాగరాజు ఈదుపల్లి, శ్రీను, వసంత్, మరియు ప్రమీల, కోమలి, వాసుకి తదితరులు పాల్గొన్నారు.