నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగ పట్నం వద్ద వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వరద నీరు వచ్చి అక్కడ పేదల జీవనం చిన్నా భిన్నమైంది. అక్కడ నివసించే 150 మంది నిరుపేదలకు జనసేన పార్టీ తరపున ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది జరిగింది. ఈ కార్యక్రమంలో గునుగుల కిషోర్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన పార్టీ జనసేన పార్టీ అని వరద బీభత్సానికి ప్రజల జీవనం చిధ్రమైతే జనసేన పార్టీ నిరుపేదలకు అండగా నిలుస్తుందని అధికార పార్టీ మాత్రం చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. ఇందుకూరుపేట మండలంలో మొత్తం ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది పూర్తి నష్టాలతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని,విచారణ జరిపి ఎవరెవరికి ఎంత నష్టం ఎంత నష్టం వాటిల్లింది వారికి పరిహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తూతూమంత్రంగా వరద బాధితుల పరామర్శించి కోట్ల రూపాయల నష్టం జరిగి ఆక్వారైతులు కుదేలయిన ఇందుకూరుపేట మండలం అసలు రావకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు మరియు రాష్ట్ర పీఏసీ చైర్మన్ మనోహర్ గారి ఆదేశాల మేరకు ఆ మండలంలో జరిగిన నష్టం నష్టాన్ని నివేదిక రూపంలో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం జరుగుతుందని, ఆక్వా రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ వారికి మద్దతతో అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు కొట్టే వెంకటేశ్వర్లు గారు విశ్వనాద్ గారు, సురేష్ గారు, నెల్లూరు జిల్లా జనసేన కమిటీ సభ్యులు గునుకుల కిషోర్, హరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుధీర్, ప్రవీణ్ కుమార్ శ్రీకాంత్, ప్రశాంత్, బాలాజీ రమేశ్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.