• ఐలూరు గ్రామస్థులు ఏమైనా పాకిస్థాన్ జాతీయులా?
• మండలాధికారులకు ఐలూరుతో ఎందుకు సంబంధం లేదో చెప్పాలి
• మీ మీద ఎవరు ఒత్తిడి చేస్తున్నారో మాకు తెలుసు
• వైసీపీకి ఓటు వేసిన వారికి మాత్రమే శ్రీ అనిల్ గారు ఎమ్మెల్యేనా?
• సర్పంచ్ ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం
• సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం
• స్పందన జనసేన పార్టీ తరఫున న్యాయపోరాటం
• సమస్యను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తాం
కృష్ణా, (జనస్వరం) : జనసేన పార్టీకి ఓటు వేశారన్న నెపంతో ఐలూరు పంచాయితీ ప్రజలను అధికారులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు వేధిస్తున్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు ఇసుక రేవులు ఉన్న గ్రామాల్లో ప్రజల అవసరాలకు ఎడ్ల బండ్ల మీద ఇసుక స్వీకరించే హక్కు ఆ గ్రామస్తులకు ఉంది. మరి ఐలూరు గ్రామ ప్రజలు ఏం పాపం చేశారని వారిని ఇసుక తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. జనసేన పార్టీకి ఓటు వేయడమే వారు చేసిన పాపమా? లేకపోతే ఐలూరు గ్రామ ప్రజలు ఏమైనా పాకిస్థానీ జాతీయులా? ఎడ్ల బండ్ల యజమానులకు అనుమతి పత్రాలు ఇవ్వాల్సిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ వారికి ఎందుకు సహకరించడం లేదో సమాదానం చెప్పాలి. వీఆర్వో గారు, తాహసీల్దార్ గారు ఇసుక తవ్వుకోవడానికి అనుమతి లేదని చెబుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఎడ్ల బండ్ల మీద ఇసుక తెచ్చుకుంటుంటే తమకు ఇసుక ఎందుకు ఇవ్వడం లేదో ఐలూరు ప్రజలకు అర్ధం కావడం లేదు. ఎవర్ని అడగాలో తెలియని పరిస్థితి. గ్రామ సభలో సర్పంచ్ శ్రీమతి పిరాటి సుజాత అధికారుల్ని ప్రశ్నిస్తే మీ గ్రామానికీ మాకు సంబంధం లేదన్న సమాధానం ఇస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అధికారులను, అధికార పార్టీ నాయకులను ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గారు పామర్రు నియోజకవర్గ ప్రజల మొత్తానికీ ఎమ్మెల్యేనా? లేక వైసీపీకి ఓటు వేసిన వారికి మాత్రమే ఎమ్మెల్యేనా? అధికార యంత్రాంగం దృష్టిలో వైసీపీ పాలిత గ్రామాల ప్రజలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని భావిస్తున్నారా? ఎందుకు ఈ వివక్ష. అధికారం శాశ్వతం కాదు. అధికారి మాత్రమే శాశ్వతం అన్న విషయం మీకు తెలియదా? రెండున్నరేళ్ల పాలనలోనే వైసీపీ ప్రజా తిరస్కారం పొందింది. అదే సమయంలో జనసేన పార్టీకి ప్రజాధరణ పెరిగిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఐలూరు పంచాయితీ పరిధిలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఎందుకు ఏడిపిస్తున్నారు? ఉపాధి హామీ పనుల్లో ఎందుకు వివక్ష చూపుతున్నారు? కనిగిరిలంక ప్రజలకు ఉపాధి హామీ పనులు లేకుండా చేయడాన్ని జనసేన పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. కృష్ణా నదీ తీర గ్రామం అయినప్పటికీ ఇసుక తెచ్చుకోలేక, గోతులు పడితే రహదారులకు పక్కనే ఉన్న బుసక తోలుకుని బాగు చేసుకోవడానికి కూడా అనుమతి లేదనడాన్ని ఏ విధంగా తీసుకోవాలి. స్థానిక శాసన సభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారి ప్రోద్భలంతోనే జనసేన పాలిత పంచాయితీలో ప్రజలను అధికారులు అన్ని విధాలుగా వేధిస్తున్నారు. మా సర్పంచ్ గారిని వేధిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము బెదురుతామనుకోవద్దు. ప్రజల హక్కులు, మా సర్పంచ్ గారి హక్కులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాలరాస్తే చూస్తూ ఊరుకోం. విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. స్పందన రాకుంటే న్యాయ పోరాటం చేస్తాం. ప్రజలను వేధించే ముందు బలమైన లీగల్ టీమ్ అండ జనసేన పార్టీకి ఉందన్న సంగతి ఐలూరు ప్రజలను వేధింపులకు గురి చేస్తున్న కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా గుర్తుంచుకోవాలి. ఐలూరు సమస్యలను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. సర్పంచ్ శ్రీమతి పిరాటి సుజాత గారికి, ఐలూరు ప్రజలకు జనసేన పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా నిలుస్తాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ పామర్రు నియోజకవర్గం తాడిశెట్టి నరేష్, ఐలూరు గ్రామ సర్పంచ్ పిరా టి.సుజాత, వైస్ ప్రెసిడెంట్ బర్మా బాబి, జిల్లా కార్యదర్శులు, ఐలూరు గ్రామపంచాయతీ ప్రజలు జనసైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు.