
గుంటూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఏటుకూరు గ్రామానికి చెందిన ఉప్పు వెంకట రత్తయ్య ను నియమించారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరత్తయ్యకు నియామక పత్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ద్వారా అందుకోవడం జరిగింది అని వెంకటరత్తయ్య సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. గతంలో యన్.యస్ .యు .ఐ పట్టణ కార్యదర్శి గాను, గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగాను, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గాను పనిచేయటం జరిగిందని వెంకటరత్తయ్య అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి పార్టీని ప్రజలకు చేరువైయే విధంగాను ప్రభుత్వం చేపట్టే తప్పుడు నిర్ణయాలను ఎండగడుతూ పార్టీ నిర్మాణం కొరకు కృషి చేస్తానని వెంకటరత్తయ్య అన్నారు. నాకు ఈ పదవి రావటానికి కారకులైన రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.