
ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఉరవకొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వసతి గృహలను తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులు చెప్పినట్టుగానే భోజనంలో పురుగులు ఉన్నాయి. ఇలా కనీసం వారంలో మూడు నాలుగు రోజులపాటు భోజనంలో వస్తున్నాయని, వీటిని ఎలా తినాలి అని విద్యార్థులు వాపోయారు. దీనిపై జనసేన పార్టీ నాయకులు వసతి గృహ నిర్వాహకులపై మండిపడుతూ నాణ్యమైన భోజనం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇటువంటి తప్పు మరొకసారి పునరావృతం కాకూడదని, ఒకవేళ అలా జరిగిన పక్షంలో ఉన్నతాధికారులకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి మీ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంద్రశేఖర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.