విజయనగరం, (జనస్వరం) : గానఘంధర్వుడు, అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ జనసేన ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి ఘనంగా శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా యశస్వి గారు అయ్యకొనేరు వద్దనున్న ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయనగరం జిల్లాలో సంగీత కళాసేవలు అందిస్తున్న ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.భీష్మరావుకు, ధవళ సర్వేశ్వరరావు, అబ్బులు, మరియు మహిళా గాయకులు శ్రీవల్లి, జయంతిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యలనగరం మన విజయనగరంలో అమరగాయకుడు ఘంటసాల వారాలుచేసి సాగించిన సంగీత అభ్యాసం తదనంతర కాలంలో సినిజగత్తులో సాటిలేని మధురగాయకుడుగా తెలుగు అభిమానులు హృదయాలను దోచుకున్నారని అన్నారు. గంధర్వులకైనా సాధ్యపడని తన గాణామృతంతో భగవద్గీత, భక్తి, వినోదం, విషాద, ప్రేమ పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అందుకే నవరసాల స్వరశాల ఘంటసాల అని ఆమె అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), దాసరి యోగేష్, మోపాడ అనిల్ కుమార్, ఆమరేష్, శ్రీను, రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.