బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా, బాపట్ల నియోజకవర్గములోని జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల నిరసన దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేపట్టడం జరిగింది. దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి రాకుండా దివ్యాంగుల అవమాన పరిచాడు. మరియు ఈ సంవత్సరమైనా డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి రావాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు నెరవేర్చవలసిన హామీలు
1. ఇద్దరు దివ్యాంగుల పెళ్లికానుక ఒకటిన్నర లక్షణాలను ఇస్తానని హామీ ఇచ్చారు.
2 దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి.
3 దివ్యాంగుల రాష్ట్ర బడ్జెట్ వెయ్యి కోట్లు విడుదల చేయాలి.
4 దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ 5 శాతం కల్పించాలి.
5 దివ్యాంగుల కుటుంబానికి 300 యూనిట్లు ఉచిత కరెంటు కల్పించాలి.
6 చదువుకున్న దివ్యాంగులు అందరికీ ఉద్యోగాలు కల్పించాలి.
7 వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక దివ్యాంగులకు 10 లక్షల రూపాయలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.
8 ప్రతి ఒక్క దివ్యాంగుడుకి పది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి.
9 పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్క దివ్యాంగుడుకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలి.
ఈ హామీలన్నీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ దీక్షలో దివ్యాంగుల సంఘాల నాయకులు కర్లపాలెం మండల అధ్యక్షులు కంది వెంకటరెడ్డి, వివి పాలెం మండల అధ్యక్షులు కేసని కోటేశ్వరరావు, పొన్నూరు మండల అధ్యక్షుడు షేక్ సుభాని, తాడిశెట్టి శ్రీనివాసరావు, దేవరపు శ్రీనివాసరావు, వల్లగాని రాధాకృష్ణమూర్తి, గంటా నాగమల్లేశ్వరరావు నాయకులు పాల్గొనడం జరిగింది.