అరకు, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వన్ టైం సెటిల్మెంట్ పట్టా పేరుతో 10 వేల రూపాయలు వసూలు చేసే విధానాన్ని తీసుకోచ్చాక, ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ కింద పదివేల రూపాయలు కట్టని వాళ్లకి కుటుంబములో పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులకు పింఛన్ ఆపేయాలని గ్రామ వార్డు స్థాయిలో వాలంటీర్లకి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పై దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ రోజు జనసేనపార్టీ నాయకులు అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం సృష్టించాలే గానీ, ప్రజల దగ్గర వసూలు చేయడం సిగ్గు చేటు అని అన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పదివేల రూపాయలు కాదు కదా! పది పైసాలు కట్టేది లేదు అని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసి, ప్రజలకు వన్ టైం సెటిల్ మెంట్ పేరుతో వసూలు చేసే విధానాన్ని రద్దు చేయాలి. పేదవాళ్లకు ఇది చాలా పెద్ద మొత్తం గనుక ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కార్యక్రమములో జనసేనపార్టీ నాయకులు అరకు పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనెడి లక్ష్మణ్ రావు, నియోజకవర్గం నాయకులు బంగురు రామదాసు, అరకు మండల నాయకులు అల్లంగి రామకృష్ణ పాల్గొన్నారు.