గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసన కార్యక్రమం చేపట్టిన ఉంగుటూరు జనసేన నాయకులు

    ఉంగుటూరు, (జనస్వరం) : ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం ఛానమిల్లి గ్రామంలో సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతి పురస్కరించుకుని జనసైనికుల ఆధ్వర్యంలో నివాళులు అర్పించి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14,15వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పనులకి మళ్లించడాన్ని ఖండిస్తూ, మళ్లించిన నిధులను తిరిగి పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి నిరసన తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడవికొలను జనసేన పార్టీ గ్రామ సర్పంచ్ పాల వెంకన్న గారు, ఛానమిల్లి గ్రామ ఉప సర్పంచ్ కొండపల్లి శేఖర్, గౌతు వెంకన్న,మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  పూతలపట్టు : చింతమాకులపల్లి జనసేన పార్టీలోకి చేరికలు