నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో వరదలు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కోవూరు ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస్ గారిని అడ్డుకున్న గ్రామస్తులు వరదల్లో చచ్చారా ? బ్రతికున్నారా! అని చూడడానికి వచ్చారా అంటూ నిలదీశారు. పీకల్లోతు నీళ్లలో కూరుకుపోయి ఇల్లు, పిల్లలు, సంపద కొట్టుకుపోయిన పట్టించుకోని ప్రభుత్వం వరద వెనక్కి వెళ్ళి పోయిన తర్వాత కులాసాగా చోద్యం చూడడానికి వచ్చారా అంటూ నిలదీసిన గ్రామస్తులను వారి బాధను లెక్కచేయక, వీటిని అంతా వీడియో చిత్రీకరించిన స్థానికులపై కేసులు బనాయించి రాత్రి 10:00 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అందులో ఒకరు మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. వరదల కారణంగా ఇల్లు, ఊరు మునిగిపోయిన సమయంలో జనసేన నాయకులు, జనసైనికులు తమ సొంత ఖర్చులతో బోట్లు వేసుకుని స్థానికులను తరలించి ప్రాణాలు కాపాడటంలో ప్రముఖపాత్ర వహించారు. అంతేకాకుండా స్థానికులకు ఆహారం, నీరు అందించడంలో ముందుండి నడిపించారు. అటువంటి వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం ఏమిటి అని జనసేన నాయకులు నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ తప్పులను అడగడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం కూడా తప్పా ! అని జనసేన నాయకులు కిషోర్ ప్రశ్నించారు. సాయంత్రం నాలుగు గంటలకై అరెస్టు చేసిన జనసైనికులు రాత్రి గం10 ల దాకా విడుదల చేయని పరిస్థితి ఇక్కడ నెలకొంది. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారి సూచనలతో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్, కోవూరు నియోజకవర్గ నాయకుడు శ్రీనివాసులు రెడ్డి, పవన్ వినయ్ తదితర జనసేన నాయకులు ఆ ప్రాంతానికి చేరుకొని జనసైనికులు విడిపించుకుని తీసుకొని వెళ్లారు.అక్రమంగా బనాయించిన కేసులను జనసేన పార్టీ లీగల్ సెల్ ద్వారా పోరాడుతామని వారికి జనసేనపార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగింది.
______________________