విజయనగరం ( జనస్వరం ) : జనసేనపార్టీ అధ్వర్యంలో యస్. కోట ఎంఆర్‌ఓ ఆఫీస్ వద్ద జనసేనపార్టీ ఆధ్వర్యంలో గిరిజనుల తరుపుల ధర్నా చేశారు. ముసిడిపల్లి పంచాయతీ శివారు గ్రామ నివాసి గిరిజనులు కిల్లివని కళ్ళలు. వీరికి సర్వే చేసి పొజిషన్ పట్టాలు ఇవ్వాలని ఉపతహశీల్దార్ హరి గారికి యస్. కోట ఎంఆర్‌ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ కరిపి నాగేశ్వరావు అను వ్యక్తి సదరు భూమి కొన్నానని గిరిజనులను ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు. సదరు భూమిలో రోడ్ కూడా వేస్తున్నాడు. ఆ భూమి సర్వే చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ భూమి తాటిపూడి నిర్వాసితులుగా పట్టా 1987లో కిల్లి కొండప్ప బార్య ముత్యాలు పేరున ఇచ్చారని వబ్బిన సన్యాసి నాయుడు అన్నారు. అప్పటినుండి తాము గుడిసెలు వేసుకొని నివాసముంటున్న కరెంట్ త్రాగునీటి బోర్ ప్రభుత్వం ఇచ్చిందని బాధితులు తెలిపారు. ఆ భూమికి పొజిషన్ పట్టాలు పంపిణీ చేయడం మరియు ఇల్లు కట్టించి ఇవ్వాలని వారిని డిమాండ్ చేశారు. కిరిపి నాగేశ్వరావు కొన్న భూమిని పిఓటీ చట్ట పరిధిలో స్వాధీనం చేసుకొని తమకి సాగు పట్టాలివ్వాలని అధికారులను కోరగా ఆయన సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో జనసేన పార్లమెంటరీ కమిటీ మెంబర్ మల్లువల్స్ శ్రీను, వీరన్న, కొండప్ప, సింహాచలం, తదితర గిరిజనులు పాల్గొన్నారు.