– ముఖ్య అర్చక పదవికి వారసత్వం లేని వ్యక్తులకు ఏ విధంగా వారసత్వం కలిగిస్తారో పాలకమండలి చైర్మన్ సమాధానం చెప్పాలి
– కంటికి కనిపించని అభివృద్ధి చేసిన మీకు నా ధన్యవాదాలు
విజయవాడ, (జనస్వరం) : ఒక దొంగ వంశ వృక్షం తయారుచేసి దానికి నోటరీ చేయిస్తే అది సక్రమం అయిపోతుందా అని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. మంగళవారం వారి కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవాలయం అనగా పాత శివాలయంలో ఉన్న అమ్మవారి ఆలయ ముఖ్య అర్చక పదవికి ఏ మాత్రం సంబంధం లేని ఇటువంటి వ్యక్తులకు ఏ విధంగా వారసత్వం కలిగిస్తారో పాలకమండలి చైర్మన్ సమాధానం చెప్పాలని, ఒక దొంగ వంశవృక్షం తయారుచేసి దానికి నోటరీ చేయిస్తే అది సక్రమం అయిపోతుందా అని, మీరు చదివి అడ్వకేట్ అయ్యారని అనుకుంటున్నాని మరి నోటరీ చేయించినంత మాత్రాన దొంగ వంశవృక్షం అసలు వంశవృక్షం అయిపోతుందా? అని వారసులు కానీ వారు వారసులు అయిపోతారని అసలు ఈఓని మీరు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఈఓకి ముఖ్య అర్చక పదవి నియామకం చేసే అధికారం లేదని, ఈ నెల 5న రాజమండ్రి వెళ్లి ఆర్ జె సి సురేష్ బాబు ని కలిసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ముడుపులు అందించిన మరుసటి రోజు శివాలయం గోడమీద ఒక నోటీస్ అంటించడం వాస్తవం కాదా అని అన్నారు. ఇదంతా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఆర్జెసి సురేష్ బాబుకి ముడుపులు అందించడం వల్లనే కదా అని అన్నారు. అర్హత లేకపోయినా అధికారం లేకపోయినా నోటిఫికేషన్ జారీ చేశారని అన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పాలకమండలి దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రజలకు తెలియజేశారు. తను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాతే మీకు అన్ని గుర్తొచ్చాయని పాలకమండలిగా అక్రమ నియామకాలను ఆపు చేయకుండా మీరు వత్తాసు పలుకుతున్నారని, అంటే మీ మీద కూడా సందేహ పడాల్సి వస్తుందన్నారు. ఐదు నెలల నుంచి ఆలయంలో అర్చకులకు సిబ్బందికి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హుండీల ద్వారా టికెట్ల అమ్మకం ద్వారా ఆలయం చుట్టూ ఉన్న షాపుల ద్వారా, బీసెంట్ రోడ్ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి వచ్చే ఆదాయం ఏమవుతుందని ప్రశ్నించారు. కరోనా సమయంలో శానిటైజ్ చేయడానికి ఎంత ఖర్చు అకౌంట్ బుక్ లో చూపించారో ఒక్కసారి తగు విచారణ చేయాలని కోరారు. చిన్నచిన్న ఖర్చులకి కూడా దాతల దగ్గరకు ఎందుకు వెళ్తున్నారని, ఎందుకు సహకరించమని పదేపదే ప్రాధేయ పడుతున్నారని, అమ్మవారి ఆలయానికి గ్రానైట్ ఒక మార్వాడి భక్తుడు ఆరు లక్షల రూపాయలతో చేయించిన మాట వాస్తవమా కాదా అని అడిగారు. దీనిని మీరు అభివృద్ధి ఖర్చులో చూపించారనే అనుమానం కలుగుతుందని అన్నారు. నవగ్రహాల పున ప్రతిష్ట ప్రస్తుత పాలకమండలిలో ఒక సభ్యులు చేయించిన మాట వాస్తవమా కాదా అని, అవి కూడా అ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఏమైనా చూపించారా అని, రూ.93 లక్షలతో కంటికి కనిపించని అభివృద్ధి చేసిన మీకు ధన్యవాదాలని ఎద్దేవా చేశారు. సాలాహారం అంటే శివాలయం చుట్టూ డిజైన్ చేయడం అంతే కదండీ నాకు తెలియదని అందుకని అడిగానని, కరెంటు ఖర్చు ఎంత అవుతాయో మీరే చెప్పాలని, రంగులు వేయడానికి ఎంత అవుతాయో మీరే చెప్పాలని, 17 ఉప ఆలయాలకు టేకు దర్వాజాలు ఖర్చు మీరే చెప్పాలని, ఆలయ విశిష్టత ఎందుకు తగ్గుతుంది గతంలో ప్రసాద్ పని చేసినప్పుడు 6ఏ ఆలయంగా ఉన్న ప్రస్తుత పాత శివాలయం ప్రభావం ఎందుకు కోల్పోతుందని పాలకమండలి సమాధానం చెప్పాలని, తను ఖచ్చితంగా చెప్పగలను అమ్మవారి ఆలయం ముఖ్య అర్చక పదవికి ముడుపులు చేతులు మారాయని, ఇందులో ఆర్ జె సి సురేష్ బాబుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు వాటా ఉందని తెలియజేశారు. లేకపోతే ఈఓ అంత ధైర్యంగా నోటీస్ బోర్డులో నోటీస్ ఉంచగలరా అని, లేని పత్రాలు సృష్టించగలరా, ఎందుకు పాలకమండలి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ పద్ధతిలో అమ్మవారి ఆలయ ముఖ్య అర్చక పదవిని అడ్డదారుల్లో నియామకం చేస్తే తప్పక కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.