
పాలకొండ, (జనస్వరం) : పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఉన్న గోడగల వీధికి అనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ ను గత 3 సంవత్సరాలుగా తొలిగించాలని స్థానికులు ధర్నాలు దీక్షలు చేసి మున్సిపాలిటీ అధికారులకు ఎన్నోమార్లు తమ గోడును విన్నవించుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో చేస్తాం అని చెప్పారు. కానీ ఫలితం శూన్యం ఎవరికి చెప్పుకున్న ఏ ఒక్కరు కూడా ఇంత వరకు స్పందించడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ ఒక్కటే మార్గం చూపిస్తారని స్థానికులు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు గారిని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన జనసేన నాయుకులు డంపింగ్ యార్డ్ ని సందర్శించడం జరిగింది. అక్కడ ప్రజల ఎదుర్కొంటున్న, ఇబ్బందులును డంపింగ్ యార్డు నుండి వస్తున్న దుర్వాసన మరియు దోమలు ఈగలు వల్ల రోగలబారిన పడుతున్న విషయాలను తెలుసుకోవటం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ తక్షణమే ప్రభుత్వం వేరే చోటుకు మార్చాలని పరిసర ప్రాంత ప్రజలు వ్యాధులకు లేకపోతే తరువాత వచ్చే సమస్యలకు పూర్తి బాధ్యత ప్రభుత్యం చూసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలకు భరోసాగా ఉంటుంది అని ఈ సమస్యకు పరిష్కారం మార్గం చూపించకపోతే నిరాహారదీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని స్థానిక ప్రజలకు ఈ సందర్భంగా భరోసా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు జనసైనికులు జానీ, సంతు, యోగేష్, వెంకటరమణ, మోహన్, సతీష్, రాజా మణి స్థానిక యువత పాల్గొన్నారు.