
తెలంగాణ ( జనస్వరం ) : జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర క్యాడర్ డెవలప్మెంట్ లో భాగంగా రాష్ట్ర వీర మహిళలకు “మహిళలు మరియు రాజకీయ అభివృద్ధి” అనే పేరు తో శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగం విశిష్టత, అందులోని వివిధ ఆర్టికల్స్, రిజర్వేషన్స్ ఇలా తదితర అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గారిచే శిక్షణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర నాయకుల మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీమతి రుక్మిణి కోట, శ్రీమతి జయ కళ్యాణి ఆకుల గార్ల పర్యవేక్షణలో హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో నవంబరు 14వ తేదిన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వీర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీమతి రత్న పిల్లా మరియు శ్రీమతి ఎమ్.నీహారిక గార్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి భాగ్య లక్ష్మి, జాయింట్ సెక్రెటరీలు శ్రీమతి సునీత ప్రసాద్ మరియు శ్రీమతి ఎస్ లక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులు శ్రీమతి పి పద్మజ, శ్రీమతి వెంకట లక్ష్మి ఎ, శ్రీమతి ఎన్ అరుణ కుమారి, శ్రీమతి శ్రావణి ఎ, శ్రీమతి ఎస్ రమ్య, శ్రీమతి కె సంతోషి, శ్రీమతి ప్రభావతి వసంతాల గార్లు, విభాగం సభ్యులు శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుభాషిణి, కొట్టే కావ్య, శ్రీమతి నాగ లక్ష్మి గార్లు తదితరులు పాల్గొన్నారు.