కువైట్ ( జనస్వరం ) : పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించిన విషయమై కువైట్ జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కువైట్ గల్ఫ్ సేన జనసేన నాయకులు కాంచన శ్రీకాంత్ పగడాల మరియు పగడాల అంజన్ కుమార్ మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో ప్రజలు పడుతున్న బాధలను గుర్తించిన శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై 5 డీజిల్ పై 10 రూపాయలు తగ్గించిన విషయం మనకం దరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన బాటనే అనుసరిస్తూ అస్సాం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్ అనుసరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంతో శోచనీయం అన్నారు. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, మన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు సెస్ పేరుతో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై మోపడం జరిగింది. ఇప్పటికైనా మిగిలిన రాష్ట్రాల బాటలోనే ప్రజలపై పడుతున్న భారాన్ని గుర్తించి అన్ని రాష్ట్ర మన రాష్ట్రం కూడా పెట్రోలు, డీజిల్ పై పన్నులు మణిపూర్, గుజరాత్, గోవా తదితర రాష్ట్రాలు ఏడు రూపాయల వంతున, ఒరిస్సా మూడు రూపాయల వంతున తమ రాష్ట్ర ప్రభుత్వ వాటాగా తగ్గించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తూ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో పెట్రోలు, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించే వరకు ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.