
కొత్తవలస, (జనస్వరం) : విజయనగరం, శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలసలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు శ్రీ టి. శివ శంకర్ గారు, శ్రీమతి పాలవలస యశస్వి గారి సమక్షంలో పెదిరెడ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో YSRCP పార్టీ నుండి వందమంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా శివశంకర్ గారు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో వారసత్వ రాజకీయాలతోను, బానిసత్వ రాజకీయాలతోను ప్రజలు బందీలుగా ఉన్నారు. వీటిని ప్రక్షాళన చేసేందుకే జనసేన పార్టీ ఆవిర్భివించిందని పేర్కొన్నారు. అలాగే యశస్వి గారు మాట్లాడుతూ ప్రజాసమస్యలపై జనసేన చేసే పోరాటాల దెబ్బకు వైస్సార్సీపీ దిగొస్తుంది. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో S కోట జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీ వబ్బిన సత్తిబాబు గారు, శ్రీ గొరపల్లి రవికుమార్ గారు, శ్రీ గొరపల్లి చినబాబు గారు, శ్రీ వబ్బిన సన్యాసినాయుడు గారు, జిల్లా నాయకులు ఆదాడ మోహన్ రావు, త్యాడ రామకృష్ణారావు (బాలు), పార్లమెంటరీ కమిటీ సభ్యులు మల్లువలస శ్రీను, నాయకులు నక్కరాజు సతీష్, వబ్బిన సతీష్, తూరిబిల్లి విజయ్ కుమార్, గురజాడ వెంకటేష్, గాలి అప్పారావు, బోని రామ గణేష్ తదితరులు పాల్గొన్నారు.