అవనిగడ్డ ( జనస్వరం ) : చల్లపల్లి మండలంలో ఎంతో చరిత్ర కలిగిన చల్లపల్లి శ్రీమంత్ రాజా హై స్కూల్ మూసివేస్తున్నట్లు తెలియడంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. హైస్కూల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా పేద విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారు. దీంతో ఘంటసాల మోపిదేవి చల్లపల్లి మండలాల్లోని పేద విద్యార్థులు ఇక్కడే చదువుకొని ప్రస్తుతం దేశవిదేశాల్లో వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. చరిత్ర కలిగిన హై స్కూల్ నూతన జీవో ప్రకారం మూసివేస్తున్నట్లు తెలియడంతో పేద విద్యార్థులను ఎక్కడ చేర్పించాలి అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు పడ్డారు విద్యా సంవత్సరం చివరలో పాఠశాల మూసివేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు తల్లి తండ్రులు. సదరు విషయం తెలుసుకొని ఈరోజు జనసేన పార్టీతరుపున హై స్కూల్ లో పర్యటించి వాస్తవ పరిస్థితి హెడ్ మాస్టర్ గారిని, ప్రిన్సిపాల్ గారిని అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు.. గత రెండు రోజులు క్రితం కూడా విద్యార్థులు రోడ్డు మీద నిరసన కూడా చేశారు.. అలాగే నిన్న స్కూల్ యాజమాన్యం విద్యార్థులు తల్లి తండ్రులు నుండి బలవతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు అనీ సోషల్ మీడియా లో వార్తలు, వార్త పత్రికలలో కూడా వచ్చాయి..ఈ స్కూల్ ముసివేయ్యటం అనేది చాలా బాధకరం ప్రభుత్వ చర్యను, ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లి తండ్రులుకు వ్యతిరేకంగా స్కూల్ మూసివేస్తే ప్రజలు సహకారంతో ఉద్యమం చేస్తాము అని జనసేన పార్టీ అధికారుల హెచ్చరిస్తున్నామని తెలిపారు. విద్యాధికారులు స్పందించి నిరుపేదలు చదువుకొనే స్కూల్ ముసివేచే కార్యక్రమం విరామించుకోవాలి అనీ చల్లపల్లి శ్రీమంత్ హై స్కూల్ ముందు నిరసన తెలిపి అనంతరం ఎంఈఓ ఆఫీస్ నందు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఆలాగే నియోజకవర్గం లో ఉన్న ఏయిడెడ్ స్కూల్స్ విషయంలో నియోజకవర్గ ఎంఎల్‌ఏ గారు కూడా స్పందించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి అనీ కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు, జిల్లా ఉపకార్యదర్శి షరీఫ్ గారు, పసుపులేటి రవి కుమార్ గారు, బొందాలపాటి ప్రసాద్, జితేంద్ర, చందు, తదితరులు పాల్గొన్నారు.