
ఒంగోలు, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆదేశాలు మేరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ఒంగోలులోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా గారి అధ్యక్షతన నివాళ్ళు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా సుంకర సాయిబాబా గారు మాట్లాడుతూ మహానీయులు పొట్టి శ్రీరాములు గారి ఆశయాలే సాధనగా ఆయన చూపిన బాటలో ముందుకు వెళ్తాము అని తెలియజేసారు. మరియు ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ గారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతాము అని తెలియజేశారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల గారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి ఆశయాలే సాధనగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని తెలియజేశారు. ప్రకాశం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి రాయపాటి అరుణ గారు మాట్లాడుతూ మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మహిళ సమస్యల మీద పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శులు చనపతి రాంబాబు, రాయని రమేష్, కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి మరియు మాల్యాద్రి నాయుడు, గోపి కృష్ణ, షేక్ సైదులు, పి. సందీప్ తదితరులు పాల్గొన్నారు.