అనంతపురం, (జనస్వరం) : తెలుగుదేశం పార్టీ నాయకులు దిగుజారుడు రాజకీయాలు మానుకోవాలని జనసేనపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి పి. భవాని రవికుమార్ పేర్కొన్నారు. జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు T.C వరుణ్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక జనసేనపార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, జనసేన పార్టీతో ఎటువంటి సంబంధం, కనీసం సభ్యత్వం కూడా లేని ఓ వ్యక్తిని పార్టీలోకి చేర్చుకొని, టీడీపీలోకి జనసేన పార్టీ నాయకుడు చేరిక అంటూ పత్రికలకు ఎక్కడం ప్రభాకర్ చౌదరి కుటీల రాజకీయాలకు ప్రతీక అని మండిపడ్డారు. బుధవారం నగరంలోని 31వ డివిజన్ చెందిన అరుణ్ భాషను పార్టీలోకి చేర్చుకుని, జనసేన పార్టీ నాయకుడు చేరిక అంటూ ప్రకటనలు ఇవ్వడం పద్ధతికాదన్నారు. అసలు ఎవరీ అరుణ్ భాష అని వారు ప్రశ్నించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం అవడాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని, జనసేన నాయకులు నిబద్ధతతో పని చేస్తారని, తమ అధినేత పవన్ కళ్యాణ్ గారి మార్గంలో నడుస్తారు తప్ప… పార్టీలు మారే వ్యక్తులు మా వద్ద ఉండరని ఇతర పార్టీల నేతలు గుర్తుంచుకోవాలన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే జనసైనికుల ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, కార్యదర్శి కే.సంజీవ రాయుడు తదితరులు పాల్గొన్నారు.