
కృష్ణా, (జనస్వరం) : విశాఖ ఉక్కు పోరాటానికి అండగా ఉండాలని ఉక్కు సమితి విజ్ఞప్తి చేయగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 31వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్లి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలిసి వారు నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొంటారు అని కిషోర్ కుమార్ పత్రిక ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 34 మంది ప్రాణ త్యాగాలతో వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం అంటే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో కేంద్రంతో మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ఆయన తెలిపారు. 22 మంది వైసీపీ, 3 మంది టీడీపీ ఎంపీలు ఉండగా వారి వలన ఉపయోగం లేదని తెలిసి కేవలం పవన్ కళ్యాణ్ గారి వలనే ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోగలం అని జనసేన పార్టీ తరపున గళం వినిపించాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి వారి కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ ఆవరణలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మరియు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి వీరమహిళలు, జనసైనికులు, తరలి రావాలని ఉక్కు భాదితులకు జనసేన పార్టీ తరుపున అండగా ఉండాలని ఆయన తెలియజేశారు.