అనంతసాగరం, (జనస్వరం) : సోమశిల జలాశయంలో దిగువప్రాంతంలో చేపలు మృత్యువాత పడిన విషయంపై జనసేన నాయకులు లక్ష్మికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సోమశిల జనసేన నాయకులు లక్ష్మి కుమార్ గౌడ్ మాట్లాడుతూ గతంలో కూడా చేపలు మృత్యువాత పడ్డాయని, అందుకు కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సమయంలో జాలర్లు చేపల వేట సాగిస్తూ ఉన్నట్లుయితే మరి జాలర్లు పరిస్థితి ఏమిటని వాపోయారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇది రెండవసారి ఐనా జలాశయం అధికారులు, మత్స్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఇకనైనా అధికారులు స్పందించి చేపలు మృతి చెందడానికి గల కారణాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అధికారులు చేపల మృత్యువాతపై చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల జనసేన పార్టీ అధికార ప్రతినిధి రవి, జనసేన నాయకులు శివ, పవన్, జననాయకులు తదితరులు పాల్గొన్నారు.