అవనిగడ్డ, ( జనస్వరం) : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ గ్రామంలో, సీతయలంక వద్ద ఉన్న Dr. Br. అంబేద్కర్ గారి విగ్రహాం వద్ద జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చెయ్యటం జరిగింది. ప్రముఖ దళిత నాయకుడు దామోదరం సంజీవియ్య గారి స్మారక భవనం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం ప్రకటించటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ గా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలి దళిత ముఖ్యమంత్రిగా పని చేసి ప్రజలు గుండెల్లో నిలిచిపోయినారు. 1960 నుండి 1962 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేసి, ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టించి, ఆయన ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు సుమారు 6 లక్షలు ఎకరాలు నిరుపేద కుటుంబాలు వారికి పంచి పెట్టటం జరిగింది. పేదల పెన్నిధి సంజీవియ్య గారి జ్ఞాపకంగా, కర్నూలులో ఆయన నివాస గృహంను స్మారక భవనంగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయటం కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించటం జరిగింది. అదే విధంగా కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవియ్య జిల్లా పేరు పెట్టాలి అనీ ప్రభుత్వంను కోరటం జరిగింది. ప్రభుత్వం స్పందించకపొతే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మేమే కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెడతాం అనీ ప్రకటించటం జరిగింది. ఆయన స్మారక భవనం అభివృద్ధికి విరాళం ప్రకటించినందుకు కృతజ్ఞతలుగా అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున ముందుగా Dr. Br. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జనసేన పార్టీ నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు, జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, ఉపకార్యదర్శి షరీఫ్, జనసేన పార్టీ నాయకులు, బాధర్ల లోలక్ష నాయుడు, రాజనాల వీరబాబు, తోట ఆంజనేయులు, అన్నపరెడ్డి ఏసుబాబు, ఎంపీటీసీ బాను, శ్రీమన్నారాయణ, పప్పుశెట్టి శ్రీనివాస్ రావు, నాగరాజు, గౌస్, జేమ్స్, ప్రకాష్, చందు, తదితరులు పాల్గొన్నారు.