గుంటూరు ( జనస్వరం ) : కొల్లూరు మండలం, పెసర్లంక గ్రామంలో మండలంలో అన్ని గ్రామాల ప్రజల గురించి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకరంతో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 500 మంది ప్రజలు అన్ని గ్రామాల నుండి వచ్చి వైద్య సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఆదిత్య హాస్పిటల్ వైద్యుల బృందం మాట్లాడుతూ గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మరియు వివిధ రకాల డాక్టర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రజలకి బీపీ, రక్త పరీక్ష మొదలు ఈసీజీ వరకు అన్నిరకాల పరీక్షలు సకాలంలో ఉచితంగా నిర్వహించి తగు మందులు అందచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి తోడ్పాటు అందించిన గ్రామ సర్పంచ్, ఎంపీటీసి సభ్యులకు మంచాల రామకృష్ణ, కోన రామాంజనేయులు మరియు విజయవంతంగా నిర్వహించిన జనసైనికులకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మండల జనసేన నాయకులు మాట్లాడుతూ త్వరలో ఈ కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మిగిలిన గ్రామాల్లో, మండలాల్లో మళ్లీ జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కమ్మెల శ్రీనివాసరావు, పెసర్లంక సర్పంచ్ వెలివల శివనాగమణి రత్తయ్య, పెసర్లంక – పెదలంక ఎంపీటీసీ వెలివల శివసుబ్రమణ్యం, చావలి గ్రామ ఎంపీటీసీ నగేష్, పెసర్లంక గ్రామ ఉప సర్పంచ్ మరియు 10 మంది వార్డు మెంబర్లు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.