ధర్మవరం, (జనస్వరం) : ధర్మవరంలో అధర్మం రాజ్యమేలుతోందని అధికార పార్టీ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడం మంచిది కాదని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డీ తెలిపారు. ఆదివారం మధుసూదన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ధర్మవరం నియోజకవర్గంలో “అరాచకాలు, భూకబ్దాలు పెరిగి పోతున్నాయని చివరకు రైతులు, కాయగూరల వ్యాపారస్తులును సైతం రోడ్డు పైకి తెచ్చిన ఖ్యాతి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికే దక్కుతుందన్నారు. రాత్రికి రాత్రి కాయకూరల వ్యాపారస్తుల రూములను పడగొట్టడం ఎంతవరకు న్యాయం అన్నారు. కాయగూరల వ్యాపారస్తులులో కొంత మంది వ్యక్తులు వైసీపీని వీడి ఇతర పార్టీలో చేరుతుండడంతో వారిపై ఉన్న కక్ష్యను ఇతర వ్యాపారస్తులపై రుద్దడం భావ్యం కాదన్నారు. వ్యాపారస్టులతో చర్చించి సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు సైతం అధికార పార్టీకి అనుకూలంగా మారి ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసే జనసేన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు. రెడ్డి సామాజిక వర్గం సైతం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పట్టణంలోని పలు స్థలాలను కబ్దా చేసి తమ స్వప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తులకు అధికారమిస్తే ఇలాగే ఉంటుంది అన్నారు. దాదాపు వంద సంవత్సరాలుగా మార్కెట్‌నే నమ్ముకున్న వందలాది వ్యాపారస్తుల కుటుంబాలతో పాటు వేలాది మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. వ్యాపారస్తులకు అనువైన స్థలాన్ని చూపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. జనసేన పార్టీ అభివృద్ధికి ఎప్పుడు అడ్డు పడదని, అయితే తీసుకునే నిర్ణయాలు మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు అడ్డ గిరి శ్యామ్ కుమార్, బెస్త శ్రీనివాసులు, గొట్లూరు రామాంజనేయులు, నాయుడు, నాయక్ తదితరులు పాల్గొన్నారు.