శ్రీకాకుళం, (జనస్వరం) : రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతమై వచ్చే 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు యువతే కీలక పాత్ర వహించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారు పిలుపు నిచ్చారు. స్టానిక ప్రైవేటు కళ్యాణమండపంలో జిల్లాలోని పది నియోజకవర్గాల పార్టీ ఇంఛార్జ్ లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయనేత పాండ్రంకి రాజేష్‌తో పాటు, సుమారు నలబై మంది యువకులు పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలను కప్పి శివశంకర్ పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, అభిమానంతో పెద్దఎత్తున, యువత పార్టీలో చేరుతుండడం శుభపరిణామమని అన్నారు. వారసత్వ రాజకీయాలు నడుస్తున్నప్పటికీ గత ఎన్నికల్లో అతి సామాన్యులకు పార్టీ టికెట్లు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలబెట్టిన ఘునత కేవలం పవన్‌కళ్యాణ్ గారికి దక్కిందని, అయితే గెలుపోటములు సహజమని, మున్ముందు పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇప్పటి నుండే యువత, పార్టీనేతలు, కార్యకర్తలు అలుపెరుగని సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. వెనుకబడిన ఈ జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం మన అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇతర పార్టీలో పనిచేసిన దాదాపు 150 కుటుంబాలవారు నేడు పార్టీలో చేరడం, పార్టీకి మరింత బలం చేకూరినట్లయిందని అన్నారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ మహిళలు, యువకులు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పాండ్రంకి రాజేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టం చేశారు. జనసేన ఉత్తరాంధ్ర సమన్వయకర్త పేడాడ రామమ్మోహన్ మాట్లాడుతూ, సమిష్టిగా పనిచేసి జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలో వచ్చేందుకు దోహదపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సనపాల సంజయ్, రమేష్, తేజ, సందీప్, సోమేష్ రవిడి రవి తదితరులు పాల్గొన్నారు.