విజయనగరం, (జనస్వరం) : ప్రముఖ నటులు, మాజీ రాజ్యసభ సభ్యులు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఆచార్య సినిమా ప్రమోషన్లో భాగంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విజయనగరం జనసేనపార్టీ కార్యాలయంలో మెగాఫ్యామిలీ మెగాభిమానుల డిజిటల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు శ్రీ రవణం స్వామి నాయుడు గారు మరియు రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ పి.భవాని రవికుమార్ గారి ఆదేశాలు మేరకు విజయనగరం జిల్లాలో డిజిటల్ కమిటీని వేసి, ఈ సమావేశాన్ని నిర్వహించామని, ఈ కమిటీ ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్ర చిరంజీవి యువత మరియు అఖిల భారత చిరంజీవి యువత నుంచి వచ్చే ఆచార్య సినిమాకు సంబంధించిన వివరాలే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు చేసే సేవా కార్యక్రమాలు మరియు ప్రపంచ వ్యాప్తంగా మెగాఫ్యామిలీ మెగాభిమానుల సేవల విశేషాలను సోషల్ మీడియా ద్వారా మండల కమిటీనుండి గ్రామకమిటీద్వారా ప్రతీ గడపకు చేరేవిధంగా చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేస్థాయని తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హాజరైన జనసేన ఝాన్సీ వీరమహిళల, జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కాటం అశ్విని గారు, పార్టీ సీనియర్ జిల్లా వీరమహిళల శ్రీమతి తుమ్మి లక్ష్మీరాజ్లు మాట్లాడుతూ తెలుగుసినీజగత్తులో పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న మనందరి అభిమాననటులు, దైవసమానులు, చిరంజీవి సేవకు ప్రతిరూపమని, ఇటువంటి మెగాఫ్యామిలీకి మెగాభిమానులుగా ఉండటం మన అదృష్టమని, చిరంజీవి చేసే నేత్ర, రక్తదానం, ఆక్సిజన్ బ్యాంక్ మరియు అభిమానులకోసం చేసే అనేక సేవా కార్యక్రమాలను గూర్చి కొనియాడారు. అనంతరం విజయనగరం జిల్లా చిరంజీవి యువత సభ్యులంతా కలసి జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళలు శ్రీమతి ముదిలి సర్వమంగల గారిని, శ్రీమతి ఎర్నాగుల గాయత్రి గారిని, శ్రీమతి పద్మశ్రీ దాస్ గారిని, శ్రీమతి తుమ్మి లక్ష్మీరాజ్ గారిని, శ్రీమతి కాటం అశ్వని గారిని, శ్రీమతి వబ్బిన గౌరీశ్వరీ గారిని, శ్రీమతి శ్యామలగారిని, శ్రీమతి భారతి గారినిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత మరియు జనసేన ముఖ్య యువ నాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, లోపింటి కళ్యాణ్ బాబు, చెల్లూరి ముత్యాల నాయుడు, దాసరి యోగేష్, పతివాడ అచ్ఛిమ్ నాయుడు, మజ్జి శివశంకర్, సీనియర్ మెగాభిమాని మిమ్స్ చంటి, చరణ్, పళ్లెం కుమార స్వామి, డాక్టర్ మురళీమోహన్ గారు, లోక్ నాధ్, కులదీప్, కనపాక శివ, జి.పైడిరాజు జనసేన నాయకులు v. సన్యాసి నాయుడు గారు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.