
రాజమహేంద్రవరం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు శ్రమదానం కార్యక్రమం చేపట్టిన రాజమహేంద్రవరం జనసేన పార్టీ. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారి చేతుల మీదగా ఈ యొక్క శ్రమదాన కార్యక్రమం స్థానిక తాడితోట జంక్షన్ వద్ద అధ్వానంగా ఉన్న రోడ్లను, గుంటలను కందుల దుర్గేష్, అనుశ్రీ సత్యనారాయణ, Y. శ్రీనివాస్ పూడ్చి శ్రమదానం చేశారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రస్తుత అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ ప్రజల యొక్క ఇబ్బందుల విషయాలను పూర్తిగా మర్చిపోయి ప్రజల ఇబ్బందులు పెట్టడం సరికాదని, మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన శ్రమదానం కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గంలో అనూహ్యమైన స్పందన మరియు ప్రజలు సహకరించడం ఆనందదాయకమని తెలియజేశారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఈ రోడ్డు మరమ్మతులను పూర్తిచేయాలని దుర్గేష్ తెలియజేశారు. అనంతరం సిటీ ఇంఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్ల అధ్వాన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలకు ఉపయోగపడే రీతిలో రోడ్డు మరమ్మత్తు పనులను సకాలంలో పూర్తి చేసి చక్కటి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం ముందుండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని తెలియజేశారు. అనంతరం వై శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ యొక్క శ్రమదానం ఈ కార్యక్రమంలో పాలు పంపులు పంచుకున్న ప్రతి ఒక్క జనసేన నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు జామి సత్యనారాయణ, YVD ప్రసాద్, గెడ్డం నాగరాజు సిటీ జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.