Search
Close this search box.
Search
Close this search box.

కర్నూలు జిల్లాకు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలి : జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

కర్నూలు

      అమరావతి, (జనస్వరం) : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహనీయుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలి. ఇది డిమాండ్ కాదు… ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కర్నూలు జిల్లా పేరును దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాగా మార్చాలి. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో అధికార మార్పిడి అనంతరం జనసేన పార్టీయే కర్నూలు జిల్లాకు ‘దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా’ గా పేరు మారుస్తుంది. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా అని మార్చినప్పుడు అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డ సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమే.

ఎందరో మహానుభావుల స్ఫూర్తితో జనసేన పార్టీ ఆవిర్భవించింది. తెలుగువారు కలిసుండాలని పదవిని తృణప్రాయంగా వదులుకున్న శ్రీ బూర్గుల రామకృష్ణరావు గారు, ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించిన పి.వి. నరసింహరావు గారు లాంటి వ్యక్తులతో పాటు పేదలు, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలబడ్డ శ్రీ దామోదరం సంజీవయ్య గారి లాంటి మహానీయులు స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించాను.

• పింఛన్ పథకానికి ఆద్యులు

శ్రీ సంజీవయ్య గారి గురించి రెండున్నర దశాబ్దాలుగా వింటున్నాను. మేధావులు, విద్యావేత్తలు, ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు, విశ్రాంత అధికారులు శ్రీ సంజీవయ్య గారి విశిష్టతను, పాలన దక్షతను చెబుతూ – ఆయన గొప్పదనం ఇలా నాలుగు గోడల మధ్య చర్చలకే పరిమితం కారాదు, భావి తరాలకు అందాలని చెబుతుండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన కేవలం రెండేళ్లే ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయన సేవలు వెలకట్టలేనివి, మరువలేనివి. ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేశారు. అణగారిన వర్గాలకు, వెనకబడిన వర్గాలు, కులవృత్తులు చేసుకొనేవారికీ, పేదలకు పంచారు. ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులిచ్చారు.

వృద్ధాప్య పింఛను పథకానికి రూపకల్పన చేసి అమలుపరచారు. ఒకసారి శ్రీ సంజీవయ్య గారు తన తల్లిని చూసేందుకు వెళ్ళి రూ.100 ఇస్తే- నువ్వు ముఖ్యమంత్రివి కాబట్టి నీ తల్లికి ఇచ్చావు… మరి మిగిలిన పేద తల్లుల పరిస్థితి ఏమిటి అని అడిగారామె. ఆ మాటలకు కదిలిపోయిన శ్రీ సంజీవయ్య గారు వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు తీసుకువచ్చారు. వెనకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచి వారికి అండగా నిలబడ్డారు. ఈ రోజు భాగ్యనగరానికి ఒకటే కార్పొరేషన్ ఉందంటే అది శ్రీ సంజీవయ్య గారి చలవే. కార్మికశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి కార్మిక పక్షపాతిగా ముద్ర వేయించుకున్నారు.

• ఆయన గొప్పదనం భావితరాలకు తెలియచేస్తాం

కేవలం రెండేళ్లే పదవిలో ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు, రాయలసీమలో గాజులదిన్నే, వరదరాజులు ప్రాజెక్టులు, కృష్ణా జిల్లాలో పులిచింతల ప్రాజెక్టులను ప్రారంభించి తన ప్రత్యేకను చాటుకున్నారు.

లండన్ లో అంబేద్కర్ భవన్ ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో అదే విధంగా సంజీవయ్య గారి నివాసాన్ని స్మారక చిహ్నంగా తీర్చిదిద్ది కాపాడుకుంటాం. అందుకోసమే జనసేన పక్షాన కోటి రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా సంజీవయ్య గారి ఇంటిని పట్టించుకోలేదు. అలాంటి మహనీయుడు పేరును ఏ పథకానికి పెట్టలేదు. ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే స్మారక భవనం నిర్మించాలని నిర్ణయానికి వచ్చాం. మేధావులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. జనసేన పార్టీ ద్వారా కోటి రూపాయల నిధులు సమకూర్చి ముందుకు వెళ్తాం.

• నీతి, నిజాయతీలకి చిరునామా

శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఎంతో నీతి, నిజాయతీలతో జీవించారు. రెండేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా ఇసుమంతైన అవినీతి మరక అంటనివ్వలేదు. ఆయన చనిపోయిన నాటికి ఆయన దగ్గర కేవలం రూ. 17 వేల నగదు, ఫియట్ కారు మాత్రమే ఉన్నాయి. అలాంటి మహనీయుడిని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రాబోయే తరాలకు ఇలాంటి మహనీయుడు చరిత్రను చెప్పాలనే ఉద్దేశంతోనే స్మారక భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాము అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way