
ఐ పోలవరం, (జనస్వరం) : ఐ.పోలవరం మండలం జి వేమవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర జనసేన పీఏసీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంఛార్జ్ పితాని బాలక్రిష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో టీడీపీ నాయకులు జి. వేమవరంగ్రామ మాజీ సౌసైటీ ప్రెసిడెంట్ కోళ్లు వీరభద్రరావు, ఐ.పోలవరం శెట్టిబలిజ సంఘ యువజన అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గ గణేష్ టీడీపీకీ రాజీనామా చేసి నుండి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి కందుల దుర్గేష్ పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా వీరభద్ర రావు, గణేష్ లు మాట్లాడుతూ జనసేనపార్టీలో జాయిన్ అవ్వడం సంతోషంగా ఉంది అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. జనసేన పార్టీ మీకు అండగావుంటుందని, జనసేన పార్టీలో చేరిన కోలా వీరభద్రరావు, కొప్పిశెట్టి దుర్గ గణేష్ కు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలియపోూరు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్డునరావు, గోదశి పుండరీష్, గుద్దటి జమ్మి, జక్కంశెట్టి పండు, మద్దింశెట్టి పురుషోత్తం, భీమల సూరినాయుడు తదితరులు పాల్గొన్నారు.