కొత్త జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు నిర్ణయించాలి.
బ్రిటీషు వారితో స్వాతంత్ర్యం కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను ఈ తెలుగు నేల ఎన్నటికీ మరువదు. మన్యం ప్రజల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న వేధింపులను చూచి చలించిపోయిన అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ఎంచుకొని, బ్రిటీషర్లను ముప్పతిప్పలు పెట్టిన అల్లూరి సీతారామరాజు చివరకు వారి చేతిలో తూటాలకు బలై తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ( జూలై 4 న ) ఆ మహానీయున్ని మనస్ఫూర్తిగా స్మరించుకొంటూ జనసేన పార్టీ తరపున అంజలి ఘటించారు. ఆ సాహసి పోరునీ… పంథాను నాటి కొందరు నాయకులు, కొన్ని పత్రికలు హర్షించకపోయినా ఆయన వేసిన బాట పీడిత ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం జిల్లాలు పెంచే యోచనలో ఉన్నది కావున ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే తను జన్మించిన పాండ్రంగి గ్రామాన్ని ఒక సందర్శనీయ ప్రాంతంగా చేయాలని కోరారు.