ప్రకాశం జిల్లాలోని రైతాంగ సమస్యలు పై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్

ప్రకాశం జిల్లా

     ప్రకాశం, (జనస్వరం) : ప్రకాశం జిల్లాలోని రైతాంగ సమస్యలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, తగ్గిన సాగు, మరియు మద్దతు ధర పెంపు గురించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ , జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకనాటి గౌతమ్ రాజ్, ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, జనసేన నాయకులు చెరుకూరి ఫణి గార్లు కలసి  ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి  వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను,  రైతుల సమస్యలను, ఈ ప్రభుత్వము పట్టించుకోవడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలపై, రైతులకు అండగా  జనసేన పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో  జిల్లా నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు. 

See also  ప్రజల మీద నిఘా పెట్టి కక్ష కడుతున్న వైసీపీ ప్రభుత్వం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి