ఎమ్మిగనూరు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పడం చేతకాని మంత్రులు పొంతనలేని మాటలను మాట్లాడి తమ పదవులను కాపాడుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అధికారం చేతిలో వుంది కదా అని నోరు అదుపులో పెట్టకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని, మంత్రులు తీరు మార్చుకోవాలని జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక చైర్మన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రేఖగౌడ్ హెచ్చరించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నామని ప్రగల్భాలు చెప్పుకొనే మంత్రులకు అమాంతంగా పెరిగిన ఇసుక, విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకుల రేట్లు, ఎన్ని రేట్లు పెంచారో కనపడటం లేదా అని ప్రశ్నించారు. చెత్త పన్నులు వేసుకుంటూ పాలనసాగించడం మీకే సాధ్యమని అన్నారు. ప్రజల అవసరాలను దూరం చేస్తూ అవసరంలేని విషయాలపై రాజకీయ దుమారం చేయడం సిగ్గుచేటన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల విషయంలో రాజకీయ జోక్యం తగదని సినీకార్మికుల పొట్ట కొట్టొద్దని చెబితే దానికి సమాధానం చెప్పలేని మంత్రులు కులాన్ని అంటగట్టి రాజకీయం చేస్తారా? కులం చూడం మతం చూడం అనే పదానికి నిర్వచనం ఇదేనా అని ఎద్దేవాచేశారు. ఆన్ లైన్ ద్వారా టికెట్టు అమ్మగా వచ్చిన డబ్బుపై అధికార పార్టీ ఆధిపత్యం ఎందుకని అధినేత ప్రశ్నించారే తప్ప ఆన్ లైన్ టికెట్లు అసలు వద్దు అని చెప్పలేదని పవన్ కళ్యాణ్ గారి అభిమతం కాదని అన్నారు. సినీపరిశ్రమ ఎదుర్కొంటున్నా ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తే ఆయన మాటలను వక్రీకరించే ప్రయత్నం చేస్తారా! ఆవేదనలో సన్యాసి అంటే పిచ్చి పట్టిన ఆంబోతుల్లా ఎవరిని అన్నాడో తెలియక బూతు పురాణాలను అంటగట్టారు తప్ప అసలైన విషయాలకు మాత్రం సమాధానం చెప్పలేదన్నారు. మీ భయం పవన్ కళ్యాణ్ గారా లేకపోతే సమస్యలపై స్పందించడం ధైర్యం లేకపోవడమా తెలియడం లేదని, అధినేత చెప్పినట్టు మీరంతా అవినీతితో ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు అని అంగీకరిస్తున్నట్లు వుందని ఒక స్పష్టత లేని మంత్రులు మీరా అధినేతను విమర్శించేది పదవులు కాపాడుకోవడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని జనసైనికుల సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు.