Search
Close this search box.
Search
Close this search box.

రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నానిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

       నెల్లూరు సిటీ, (జనస్వరం) :  జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నేడు నెల్లూరు సిటీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రుల తీరుని తనదైన శైలిలో ఎండగట్టారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గడచిన 15 ఏళ్ళలో అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టి లక్ష కోట్లకు సంపాదించిన వ్యాపార దిగ్గజం ఎవరైనా ఉన్నారంటే అది సీఎం జగన్ మోహన్ రెడ్డి గారే అన్నారు. అదంతా అక్రమాస్తులని, క్విడ్ ప్రో కో క్రింద జరిగాయని ఎన్ని ఆరోపణలున్నా, 16 నెలలకు పైగా ఆయన రిమాండ్ లో ఉన్నా ఇప్పటికి కూడా అవన్నీ అవాస్తవాలని వాదించే వైసీపీ అపర మేధావులు, పేటీఎం సభ్యులు ఉన్నారన్నారు. వారి దృష్టికోణంతో చూసినా అంతటి వ్యాపార దిగ్గజం జగన్ గారికి ఒక వ్యాపారం ఎలా జరుగుద్దో తెలియదా అని ప్రశ్నించారు. సినిమా రంగం అనేది స్వచ్ఛంద సేవో, సొసైటీ సేవో, ట్రస్ట్ లా ద్వారా జరిగే సేవో కాదని, అది ఒక వ్యాపారం అని గుర్తించాలని అన్నారు. ఏ వ్యాపారం అయినా మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై ల ఆధారంగానే మనుగడ ఉంటుందని, సినిమా రంగం అందుకు మినహాయింపు కాదన్నారు. పైపెచ్చు సినిమా వ్యాపారంలో ఖచ్చితమైన లాభాలనేవి ఉండవని, ఒక సినిమా హిట్ అవుద్దో, ప్లాప్ అవుద్దో విడుదల అయ్యే వరకు ఊహలకు కూడా అందదని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించే నిర్మాతల పరిస్థితి విడుదల సమయంలో అత్యంత ఆందోళనకరంగా ఉంటుందని, రికవరీ రేటు కూడా సినిమా సినిమాకి మారుతుంటుందని అన్నారు. ప్రజల్లో సినిమాల పట్ల ఆసక్తి ఎలా ఉంటుందనే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని పెట్టి కొన్ని కోట్లు పెట్టి “సంస్కారవంతుడు” అనే టైటిల్ పెట్టి సినిమా తీసినా ఎవరూ చూడరని, అదే “బెట్టింగ్ రాజు” అని టైటిల్ పెట్టి తీస్తే మంత్రి అనిల్ ఆత్మకథ ఉందేమో అనే ఆసక్తితో అయినా చూసి కలెక్షన్లు కురిపిస్తారని ఎద్దేవా చేసారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కళను నమ్ముకున్న కళాకారులు సినిమాలు తీస్తూ తెలుగు చలన చిత్ర రంగానికి ప్రపంచంలోనే గొప్ప గుర్తింపును తెచ్చారన్నారు. సినిమా నిర్మాణం గురించి, బడ్జెట్ గురించి ఏమాత్రం అవగాహన లేని మంత్రులు కొందరు ఈ రోజు సినిమా రంగంపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరుసటి రోజు మార్కెట్లో దొరికే టమాటా, ఉల్లిపాయ ధర ఎలా ఉంటుందో కూడా మన చేతుల్లో ఉండవు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిమాండ్ అండ్ సప్లై లను బట్టి మారుతుంటాయన్నారు. వాటిని నియంత్రించే స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కానీ సినిమా టికెట్ రేట్ల నియంత్రణ ఎప్పటినుండో ఉందని, జగన్ ప్రభుత్వం కొత్తగా చేసేదేమి లేదన్నారు. సినీనటుల రెమ్యునెరేషన్ లను, సినిమా బడ్జెట్ లను నియంత్రించాలని మంత్రులు మాట్లాడడం వారి అవగాహనారాహిత్యానికి నిదర్శనం అన్నారు. సినీ కళాకారులు అనేది వివిధ వృత్తుల మాదిరే ఒక వృత్తి అనే జ్ఞానం ఈ మంత్రులకు లేదా అని ప్రశ్నించారు. 10 వేల రూపాయలు తీసుకుని పని చేసే ఇంజనీర్లు ఉంటారు, అదే పనికి 10 లక్షల రూపాయలు తీసుకునే వారు ఉంటారని, వెయ్యి రూపాయలు ఛార్జ్ చేసే డాక్టర్లు ఉంటారు, అదే విధంగా 10 లక్షలకు పైగా ఛార్జ్ చేసే స్పెషలిస్టులు కూడా ఉంటారని అన్నారు. అంతెందుకు ఒక చిన్న ఉదాహరణగా తీసుకుంటే జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును వాదించడానికి ప్రత్యేక ఫ్లైట్ వేసి రోజుకి కోటి రూపాయలు ఇచ్చి దివంగత రామ్ జెఠ్మలాని గారిని ఎందుకు పిలిపించుకున్నారని, రాష్ట్రంలో అంతకంటే తక్కువ తీసుకునే అడ్వకేట్లే జగన్ గారికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఏ రంగం అయినా అందులో స్థాయి ఏర్పడడం ఆయా వ్యక్తుల యొక్క ప్రతిభ, కష్టం, మార్కెట్ పరిధి, డిమాండ్ లను బట్టి ఉంటుందని ఈ విషయాలను అజ్ఞానంతో వాగుతున్న సన్నాసి మంత్రులు తెలుసుకోవాలని హితవు పలికారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రెమ్యునెరేషన్ ఎంత తీసుకోవాలి అనేది ఆయన చేతుల్లో కూడా ఉండదని, అది సినిమా కథాకథనాలు, కాల్షీట్లు, తీసే సమయం, తారాగణం, మార్కెట్ డిమాండ్, చేసే బిజినెస్ ఇలా అనేక అంశాల ఆధారంగా ఉంటుందని తెలిపారు. సినిమా కళాకారులు వారి మార్కెట్ పరిధి, డిమాండ్ లకు అనుగుణంగానే పారితోషికాలు తీసుకుంటున్నారని, అవకాశాలు లేని సమయంలో వారు నిజాయితీగా సంపాదించుకున్న సొమ్ముతోనే బ్రతుకుతున్నారు కానీ ప్రభుత్వాల మీద ఆధారపడట్లేదని పేర్కొన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి మంత్రి పదవులు పొందిన కొందరు సన్నాసులు ఇప్పుడెలాగో మంత్రి పదవి పోతుంది వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తాదో రాదోనన్న సందేహంలో పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తేనే ఎమ్మెల్యే టికెట్ వస్తాదనే ఆశతో మాట్లాడుతున్నారన్నారు. అందులో ప్రముఖ సన్నాసి నెల్లూరు జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అని అన్నారు. రాష్ట్ర జలవనరులశాఖామంత్రిగా ఇప్పటికే అపర భగీరథుడు, జలాభిరాముడు, జలాంతర్గామి వంటి బిరుదులు సొంతం చేసుకున్న అనిల్ కు పిల్ల వాగుకి, పోలవరానికి కూడా తేడా తెలియదని ఎద్దేవా చేసారు. తన స్థాయి మరచి పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయడం ఈయనకొక ఫ్యాషన్ అని, అందులో భాగంగానే ఇప్పుడు కూడా వ్యాఖ్యలు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు బ్యానర్లు, కటౌట్లు కట్టానని తెల్పిన అనిల్ గతాన్ని మర్చిపోకపోవడం సంతోషం అని అన్నారు. ఈరోజు అనిల్ ఒక మంత్రి అవొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి ముందు అతని స్థాయి బ్యానర్లు కట్టుకునేదే అని, అది తెలుసుకుని అనిల్ మసలుకోవాలని దుయ్యబట్టారు. ప్రభుత్వం దృష్టిలో పవన్ కళ్యాణ్ గారైనా, సంపూర్ణేష్ బాబు గారైనా ఒకటే అన్నారని, మంచిదని, ప్రజల దృష్టిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయినా వాలంటీర్ రమణయ్య అయినా ఒక్కటే అనేలా మంత్రుల పనితీరు ఉందని ఎద్దేవా చేసారు.మంత్రి అనిల్ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా అని తెల్పుతూ పవన్ కళ్యాణ్ గారి పన్నుల లెక్కలు, అదేవిధంగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సంపూర్ణేష్ బాబు గార్లు కట్టే పన్నుల వివరాలు, ఎవరి మార్కెట్ స్థాయి ఎంత, ఎవరెవరి సినిమాల ద్వారా ప్రభుత్వాలకు ఎంతెంత ఆదాయం చేకూరుతుందనే అంశాలను పరిశీలించాలని కోరారు. అనిల్ కు తన శాఖ మీదే కాదు కదా సాధారణ అంశాల మీద కూడా అవగాహన లేదని, కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని దీన్ని బట్టి అర్థం అవుతుందని, ఇటువంటి వ్యక్తిని మంత్రిగా చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి దండేసి దణ్ణం పెట్టొచ్చన్నారు. ఇక మరో సన్నాసి, గుమ్మడి కాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకుని వచ్చి నేనే అని నిన్న మీడియా ముందుకు వచ్చి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన మంత్రి పేర్ని నానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందరూ వారి వారి నోళ్ళల్లో వారి నాలుకలనే పెట్టుకుని ఉన్నారని, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు అరగంట కార్యకలాపాలు చేసే ఈ వైసీపీ సన్నాసులు ఏమి పెట్టుకుని ఉన్నారో ప్రజలందరిలో అనుమానం ఉందని ఎద్దేవా చేసారు. వకీల్ సాబ్ అనే సినిమాని మీ ప్రభుత్వం అడ్డుకుంటేనే, టికెట్ ధరల విషయంలో అన్ని సినిమాల మాదిరి అనుమతులు లేకుండా చేసినా 60 కోట్ల మేరకు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 20 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్తున్నారంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమన్నారు. ఇప్పుడు 151 సీట్లు వచ్చిన వైసీపీకి, వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. ఇప్పటికే పొదుపు మహిళలు దాచుకునే డబ్బును బ్యాంకులకు షూరిటీగా చూపించి అప్పులు పొందుతున్న ప్రభుత్వం,. సినిమా టికెట్ల డబ్బును ప్రభుత్వ పోర్టల్ ద్వారా దారి మళ్ళించుకుని షూరిటీగా చూపించి అప్పులు పొందాలని చూస్తోందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఉంటే సినిమా టికెట్ల డబ్బును కాదని, రాష్ట్రంలో సొసైటీల పేరుతో నడుస్తున్న విద్య, వైద్యం ఫీజులను, బిల్లులను పోర్టల్ ద్వారా వసూలు చేయాలని అన్నారు. వ్యాపారాల డబ్బును కూడా ప్రభుత్వ పోర్టల్ ద్వారా వసూలు చేయాలంటే ముందుగా భారతీ సిమెంట్ వ్యాపార వ్యవహారాల డబ్బును వసూలు చేసి సీఎం జగన్ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకు మురళి రెడ్డి, బొబ్బేపల్లి సురేష్ నాయుడు, హేమంత్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way